భారత జట్టులో అతడే 'గేమ్ ఛేంజర్'
వచ్చే నెలలో భారత్, శ్రీలంక సంయుక్తంగా నిర్వహించనున్నాయి టీ20 ప్రపంచకప్. డిఫెండింగ్ ఛాంపియన్‌గా టీమ్ ఇండియా రంగంలోకి దిగనుంది.
By - Medi Samrat |
వచ్చే నెలలో భారత్, శ్రీలంక సంయుక్తంగా నిర్వహించనున్నాయి టీ20 ప్రపంచకప్. డిఫెండింగ్ ఛాంపియన్‌గా టీమ్ ఇండియా రంగంలోకి దిగనుంది. టీ20 ఫార్మట్‌కి తగిన ఆటగాళ్లు భారత్‌లో ఉన్నందున అందరి చూపు ఈ జట్టుపైనే ఉంటుంది.
వారిలో ఒకరు అభిషేక్ శర్మ. అతడు తన తుఫాను బ్యాటింగ్‌తో బౌలర్లకు ముప్పుగా మారాడు.. అభిషేక్ టీమ్ ఇండియాలోకి ప్రవేశించినప్పటి నుండి టీ20లో జట్టుకు ముఖ్యమైన బ్యాట్స్‌మెన్‌గా మారాడు. అతని తుఫాను బ్యాటింగ్ భారత్‌కు ఎన్నో గొప్ప విజయాలను అందించింది. అతని ఈ స్టైల్ బౌలర్లకు శాపంగా మారింది.
అయితే పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ ప్రకారం.. అభిషేక్ శర్మ కాకుండా మరో ఆటగాడు భారత జట్టుకి గేమ్ ఛేంజర్ అని పేర్కొన్నాడు. సూర్యకుమార్ చాలా ప్రమాదకరమైన బ్యాట్స్‌మెన్ అని, అతని బ్యాట్ పని చేస్తే టీమ్ ఇండియాకు అదృష్టం పట్టినట్లేనని అక్తర్ అన్నాడు. ప్రస్తుతం సూర్యకుమార్ ఫామ్‌లో లేడు. అతడి ఫామ్‌పై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
PTV స్పోర్ట్స్‌తో అక్తర్ మాట్లాడుతూ, "భారత జట్టులో ప్రతిభకు కొరత లేదు, అందుకే టైటిల్ పోరులో భారత జట్టు అతిపెద్ద పోటీదారు అని నేను భావిస్తున్నాను, అయితే టీమ్ ఇండియా గెలవాలంటే కెప్టెన్ సూర్యకుమార్ పరుగులు చేయాలి. అతడు భారత్‌కు ముఖ్యమైన ఆటగాడు.. గేమ్ ఛేంజర్ అని నిరూపించగలడు.. టీమ్ ఇండియా టైటిల్‌ను కాపాడుకోవాలంటే కెప్టెన్ పరుగులు చేయాలి. టీ20లో త్వరగా పరుగులు చేసే విషయానికి వస్తే.. సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్‌లో రాణించడం చాలా అవసరం.. ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 మధ్య జరిగే టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా కెప్టెన్ బ్యాటింగ్ చేయడం చాలా ముఖ్యం అని పేర్కొన్నాడు.