నైట్ వాచ్‌మన్ గా వచ్చిన భారత పేసర్ ఆకాశ్ దీప్ ఓవల్ టెస్టులో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. రెండు వికెట్లు పడ్డాక.. నైట్ వాచ్‌మన్‌గా వచ్చిన ఆకాశ్ హాఫ్ సెంచరీతో అలరించాడు. తొలి సెషన్‌లో ఇంగ్లండ్ పేసర్ల ధాటికి అద్భుతంగా ఆడాడు. దాదాపు రెండు గంటల పాటూ క్రీజులో నిలిచిన అతడు, అట్కిన్సన్ ఓవర్లో బౌండరీలతో కెరీర్లో మొదటి అర్ధ శతకం నమోదు చేశాడు. 2011లో అమిత్ మిశ్రా ఇంగ్లండ్ పై 84 రన్స్ బాదాడు. ఆకాశ్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగానే కోచ్ గంభీర్ కూడా నవ్వేశారు. ఆకాష్ దీప్ సింగ్ 66 పరుగులు చేసి పెవిలియన్ బాట పట్టాడు.
లంచ్ సమయానికి యశస్వీ జైస్వాల్ (85 నాటౌట్), కెప్టెన్ శుభ్‌మన్ గిల్(11 నాటౌట్) క్రీజులో నిలిచారు. లంచ్ బ్రేక్ సమయానికి భారత్ 3 వికెట్ల నష్టానికి 189 రన్స్ కొట్టింది. ప్రస్తుతానికి గిల్ 166 పరుగుల ఆధిక్యంలో ఉంది.