IPL 2023 : ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించకపోవచ్చు : మాజీ క్రికెటర్
Aakash Chopra's bold prediction for Delhi Capitals. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్ 2023) 16వ సీజన్ ప్రారంభం కాకముందే,
By Medi Samrat Published on 28 March 2023 9:15 PM ISTAakash Chopra's bold prediction for Delhi Capitals
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్ 2023) 16వ సీజన్ ప్రారంభం కాకముందే, ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. కారు యాక్సిడెంట్‌కు గురైన జట్టు రెగ్యులర్ కెప్టెన్ రిషబ్ పంత్ సేవలు జట్టుకు అందడం లేదు. పంత్ లేకుండా ఢిల్లీ బోటు ఎలా ప్రయాణిస్తోందో అన్న ప్రశ్న.. ఆ జట్టు అభిమానులను ఎంతగానో వేధిస్తోంది. ఇలాంటి పరిస్థితులలో.. భారత జట్టు మాజీ ఆటగాడు ఆకాష్ చోప్రా ఢిల్లీ అభిమానులకు షాకిచ్చే ప్రకటన చేశాడు. ఈ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ప్లేఆఫ్స్‌కు చేరుకోవడంలో విఫలమవుతుందని ఆకాష్ అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఐపీఎల్-2023లో పరిమితికి మించి రిషబ్ పంత్‌ను జట్టు కోల్పోబోతోందని అన్నాడు.
ఆకాష్ చోప్రా IPL 2023లో ఢిల్లీ జట్టులో అతని అత్యుత్తమ ప్లేయింగ్ XIని ప్రకటించాడు. ఆకాష్ ప్రకారం.. డేవిడ్ వార్నర్, పృథ్వీ షా ఢిల్లీ ఇన్నింగ్స్‌ను ఓపెనింగ్ చేస్తారు. అదే సమయంలో.. మూడవ స్థానంలో ఫామ్‌లో ఉన్న మిచెల్ మార్ష్, అనుభవజ్ఞుడైన బ్యాట్స్‌మెన్ మనీష్ పాండేని నాలుగో స్థానంలో పంపవచ్చు. దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్ రిలే రస్సో లేదా కరేబియన్ ఆల్ రౌండర్ రోవ్‌మన్ పావెల్‌కు ఐదో నంబర్‌లో దిగుతారని చెప్పాడు. పంత్ స్థానంలో సర్ఫరాజ్ ఖాన్‌ను వికెట్ కీపర్‌గా జట్టులో ఉంచాలని ఆకాష్ సూచించాడు.
బౌలింగ్ ఎటాక్‌కు సంబంధించి కుల్‌దీప్ యాదవ్‌తో పాటు ఢిల్లీకి మరో ముగ్గురు బౌలర్లు అవసరమని పేర్కొన్నాడు. ఎర్నిక్ నార్కియా, చేతన్ సకారియా, ముఖేష్ కుమార్ లేదా ఇశాంత్ శర్మలు భౌలింగ్‌లో ప్రధానంగా ఆశలు పెట్టుకోగల ఆటగాళ్లుగా పేర్కొన్నాడు. ఐపీఎల్ 2023లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తమ తొలి మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్‌తో తలపడనుంది. రెండు జట్ల మధ్య ఈ మ్యాచ్ ఏప్రిల్ 1న లక్నోలో జరగనుంది. గత సీజన్‌లో ఢిల్లీ ప్రదర్శన మిశ్రమంగా ఉంది. ఆ జట్టు ఆడిన 14 మ్యాచ్‌లలో 7 గెలిచింది.