భారత్ ఓడిపోయినందుకు సంబరాలు.. ఏడుగురు విద్యార్థులు అరెస్టు

ప్రపంచకప్ 2023 ఫైనల్‌లో భారత క్రికెట్ జట్టు ఓడిపోయినందుకు సంబరాలు చేసుకోవడమే కాకుండా

By Medi Samrat  Published on  28 Nov 2023 4:00 PM GMT
భారత్ ఓడిపోయినందుకు సంబరాలు.. ఏడుగురు విద్యార్థులు అరెస్టు

ప్రపంచకప్ 2023 ఫైనల్‌లో భారత క్రికెట్ జట్టు ఓడిపోయినందుకు సంబరాలు చేసుకోవడమే కాకుండా భారత వ్యతిరేక నినాదాలు చేసినందుకు జమ్మూ కశ్మీర్‌లోని ఒక విశ్వవిద్యాలయానికి చెందిన ఏడుగురు విద్యార్థులను చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం (UAPA) కింద అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. అరెస్టయిన కశ్మీరీ విద్యార్థులు షేర్-ఇ-కశ్మీర్ యూనివర్శిటీ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ (SKUAST)లో చదువుతున్నారు. వారి మీద UAPA, ఇండియన్ పీనల్ కోడ్ (IPC)లోని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

భారత్ ఓటమిని బాణాసంచా పేల్చి సెలెబ్రేట్ చేసుకుంటూ ఉండగా.. అందుకు ఇతర విద్యార్థులు అభ్యంతరం వ్యక్తం చేశారు. నిందితులు వారిని కూడా బెదిరించారు. కాశ్మీరీయేతర విద్యార్థి ఫిర్యాదు మేరకు హాస్టల్‌లో వేడుకలు జరిగిన కొన్ని రోజుల తర్వాత ఈ ఏడుగురిని పోలీసులు తీసుకెళ్లారు. అరెస్టయిన వారిని తౌకీర్ భట్, మొహ్సిన్ ఫరూఖ్ వానీ, ఆసిఫ్ గుల్జార్ వార్, ఉమర్ నజీర్ దార్, సయ్యద్ ఖలీద్ బుఖారీ, సమీర్ రషీద్ మీర్, ఉబైద్ అహ్మద్‌లుగా పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం ఏడుగురు కస్టడీలో ఉన్నారని, తదుపరి విచారణ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.

Next Story