టీ20 ప్రపంచకప్‌లో రెండుసార్లు డ‌కౌట్ అయిన కోహ్లీ.. ఎక్కువ సార్లు ఏ బ్యాట్స్‌మెన్ అయ్యాడంటే..

టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ రెండుసార్లు ఖాతా తెరవకుండానే ఔటయ్యాడు.

By Medi Samrat  Published on  26 Jun 2024 3:45 PM GMT
టీ20 ప్రపంచకప్‌లో రెండుసార్లు డ‌కౌట్ అయిన కోహ్లీ.. ఎక్కువ సార్లు ఏ బ్యాట్స్‌మెన్ అయ్యాడంటే..

టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ రెండుసార్లు ఖాతా తెరవకుండానే ఔటయ్యాడు. దీంతో కోహ్లీ పేరు మీద ఓ చెత్త‌ రికార్డు కూడా నమోదైంది. టీ20 ప్రపంచకప్‌లో రెండుసార్లు సున్నాకి ఔట్ అయిన తొలి భారత బ్యాట్స్‌మెన్‌గా విరాట్ కోహ్లీ నిలిచాడు. కోహ్లీ ఔటైన తర్వాత టీ20 ప్రపంచకప్‌లో అత్యధిక సార్లు సున్నాకే ఔటైన టాప్-5 బ్యాట్స్‌మెన్ ఎవరన్న ప్రశ్న అభిమానుల్లో తలెత్తుతోంది.

5) రోలోఫ్ వాన్ డెర్ మెర్వే - నెదర్లాండ్స్ స్టార్ ప్లేయర్ రోలోఫ్ వాన్ డెర్ మెర్వే T20 ప్రపంచకప్‌లో ఖాతా తెరవకుండానే నాలుగుసార్లు ఔట్ అయ్యాడు. మెర్వ్ 13 ఇన్నింగ్స్‌ల్లో నాలుగుసార్లు సున్నా వద్ద ఔటయ్యాడు. T20 ప్రపంచకప్‌లో అత్యధిక సార్లు సున్నాకి ఔట్ అయిన బ్యాట్స్‌మెన్‌ల‌లో మెర్వే 5వ స్థానంలో ఉన్నాడు.

4) కల్లమ్ మెక్‌లియోడ్ – స్కాట్‌లాండ్‌కు చెందిన కల్లమ్ మెక్‌లియోడ్ T20 ప్రపంచ కప్‌లో అత్యధిక సార్లు సున్నా వ‌ద్ద‌ ఔట్ అయిన బ్యాట్స్‌మెన్‌ల‌లో నాల్గవ స్థానంలో ఉన్నాడు. మెక్‌లియోడ్ 11 ఇన్నింగ్స్‌ల్లో ఖాతా తెరవకుండానే నాలుగుసార్లు ఔటయ్యాడు.

3) జార్జ్ డాక్రెల్ - ఐర్లాండ్‌కు చెందిన జార్జ్ డాక్రెల్ పేరు ఈ జాబితాలో మూడవ స్థానంలో ఉంది. డోక్రెల్ T20 ప్రపంచకప్‌లో 11 ఇన్నింగ్స్‌లు ఆడాడు. ఖాతా తెరవకుండానే నాలుగు సార్లు ఔటయ్యాడు.

2) తిలకరత్నే దిల్షాన్ - శ్రీలంక మాజీ బ్యాట్స్‌మెన్ తిలకరత్నే దిల్షాన్ T20 ప్రపంచకప్‌లో ఖాతా తెరవకుండానే 5 సార్లు ఔట్ అయ్యి రెండో స్థానంలో ఉన్నాడు. దిల్షాన్ టీ20 ప్రపంచకప్‌లో 34 ఇన్నింగ్స్‌లు ఆడాడు.

1) షాహిద్ అఫ్రిది - T20 ప్రపంచకప్‌లో అత్యధిక సార్లు సున్నాకే ఔట్ అయిన రికార్డు పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది పేరు మీద ఉంది. 32 ఇన్నింగ్స్‌ల్లో అఫ్రిది ఖాతా తెరవకుండానే ఐదుసార్లు ఔటయ్యాడు.

Next Story