నేటి నుంచి ప్రత్యేక రైళ్లు.. ఈ మార్గదర్శకాలు పాటించాల్సిందే

By సుభాష్  Published on  1 Jun 2020 3:27 AM GMT
నేటి నుంచి ప్రత్యేక రైళ్లు.. ఈ మార్గదర్శకాలు పాటించాల్సిందే

దేశ వ్యాప్తంగా కరోనా వైరస్‌ విజృంభిస్తుండటంతో లాక్‌డౌన్‌ కొనసాగుతోంది. ఇక మే 31తో ముగిసిన లాక్‌డౌన్‌ 4.0.. జూన్ 1 నుంచి 30వ తేదీ వరకూ పొడిగించింది కేంద్ర ప్రభుత్వం. లాక్‌డౌన్‌ సడలింపులో భాగంగా రైల్వే సేవలను పునరుద్దరిస్తోంది. ఇప్పటికే శ్రామిక రైళ్లను నడిపిన భారత రైల్వే జూన్‌ 1 నుంచి వంద రూట్లలో 200 ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. అంతేకుండా కొన్ని సడలింపులతో ప్రత్యేక మార్గదర్శకాలను విడుదల చేసింది.

►ఈ 200 ప్రత్యేక రైళ్లలో అన్‌ రిజర్వ్‌డ్‌ కోచ్‌లు అనేవి ఉండవు. యూటీఎస్‌ టికెట్లు కూడా ఉండవు. అన్నీ రిజర్వ్‌డ్‌ కోచ్‌లే. ఈ రైళ్లకు ఐఆర్‌సీటీసీలోనే టికెట్లు తీసుకోవాల్సి ఉంటుంది.

►ప్రత్యేక రైళ్లలో ఏసీ, నాన్‌ఏసీ క్లాస్‌లే ఉంటాయి. ఈ ప్రత్యేక రైళ్లలో ప్రయాణించేవారికి సీటు లభిస్తుంది. జనల్‌ కోచ్‌లలో సీటు బుక్‌ అయితే సెకండ్‌ సీటింగ్‌ చార్జీ వసూలు చేస్తుంది రైల్వే. అడ్వాన్స్‌ రిజర్వేషన్ చేసుకునేందుకు కనీసం 30 రోజులు ఉంటుంది.

తత్కాల్‌, ప్రీమియం తత్కాల్‌ బుకింగ్‌లు ఉండవు

ఈ రైళ్లలో తత్కాల్‌, ప్రీమియం తత్కాల్‌ బుకింగ్‌లు ఉండవు. రైల్వే ప్రయాణికుల టికెట్ రద్దు, రీఫండ్‌ నిబంధనలు -2015 నిబంధనలే ప్రత్యేక రైళ్లకు వర్తిస్తాయి.

► రోజువారిగా నడిచే రైళ్ల మాదిరిగానే ఈ ప్రత్యేక రైళ్లలో అన్ని కోచ్‌లు ఉంటయి. దివ్యాంగులకు, పేష్లకు ఇచ్చే సదుపాయాలు ఈ ప్రత్యేక రైళ్లలో ఉంటాయి.

► రైలు బయలుదేరడానికి సుమారు 4 గంటల ముందే మొదటి చార్జ్‌, 2 గంటల ముందు రెండో చార్జ్‌ రిలీజ్‌ అవుతుంది. టికెట్‌ ఓకే అయిన ప్రయాణికులు 90 నిమిషాల ముందే రైల్వే స్టేషన్‌కు చేరుకోవాల్సి ఉంటుంది.

► రైలు ఎక్కే ముందు స్క్రీనింగ్ చేస్తారు. కరోనా లక్షణాలు లేకుండా రైలులో ప్రయాణించేందుకు అనుమతి ఇస్తారు. ఈ రైళ్లలో ప్రయాణికులకు దుప్పట్లు, కర్టెన్స్‌ అందించరు. అవసరం అనుకుంటే సొంత దుప్పట్లు, శాలువాలు తెచ్చుకోవాలి.

► ప్రయాణికులకు మాస్కులు తప్పని సరి. భౌతిక దూరం తప్పనిసరి పాటించాలి. లేకపోతే చర్యలు తీసుకోనుంది రైల్వే శాఖ. రైళ్లలో కేటరింగ్‌ సేవలు ఉండవు. ప్రయాణికులు ఇంటి నుంచి ఆహారం గానీ, నీళ్లు తీసుకెళ్లాల్సి ఉంటుంది.

► ప్రయాణికులు తమ తమ గమ్యస్థానాలకు చేరుకున్నప్పుడు ఆయా రాష్ట్రాలు, కేంద్ర పాలిన ప్రాంతాలు సూచించిన హెల్త్‌ ప్రోటోకాల్స్‌కు కట్టుబడి ఉండాలి. ప్రయాణికులందరు ఆరోగ్య సేతు యాప్‌తప్పని సరి డౌన్‌ లోడ్‌ చేసుకోవాలి.

►దీర్ఘకాల వ్యాధులున్న వారు, పదేళ్లలోపు, అలాగే 65 ఏళ్లపైబడిన వారు అత్యవసరమైతే తప్ప ప్రయాణం చేసేందుకు అనుమతి లేదు.

Next Story
Share it