దేశ వ్యాప్తంగా కరోనా వైరస్‌ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. చైనాలో పుట్టిన ఈ వైరస్‌ ప్రపంచ దేశాలకు చాపకింద నీరులా వ్యాపించింది. దీంతో మే 31 వరకు ఉన్న లాక్‌ డౌన్‌ను జూన్‌ 30 వరకూ పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీంతో కొన్ని సడలింపులు కూడా ఇచ్చింది. దేశంలో రోజురోజుకు కరోనా కేసులు తీవ్రతరం కావడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కత్తిమీద సాములా మారింది. లాక్‌డౌన్‌ 5.0లో భాగంగా జూన్‌ 8వ తేదీ నుంచి భారీగానే సడలింపులు ఇస్తూ కేంద్రం పలు మార్గదర్శకాలను జారీ చేసింది.

జూన్‌ 8 నుంచి మినహాయింపులు:

– హోటళ్లు, రెస్టారెంట్లు
– షాపింగ్‌ మాల్స్‌
– దేవాలయాలు
– ప్రార్థనా మందిరాలు
– స్వీట్‌ షాపులు
– అంతర్‌ రాష్ట్ర రవాణా

మినహాయింపు లేనివి :

– సినిమా హాళ్లు
– మెట్రో రైళ్లు
– జిమ్స్‌లు
– బార్లు, పబ్బులు, క్లబ్బులు
– స్విమ్మింగ్‌ ఫూల్స్‌
– పార్కులు
– అంతర్జాతీయ విమానాలు
– సభులు- సమావేశాలు

కాగా, కేంద్రం ఈ సడలింపులు ఇచ్చినా.. అప్పటి పరిస్థితులను బట్టి మరిన్ని నిర్ణయాలు తీసుకోనున్నట్లు కేంద్ర హోంశాఖ తెలిపింది.

ఇక రాత్రి వేళల్లో విధించే కర్ఫ్యూలోనూ కేంద్రం సడలింపులు ఇచ్చింది. ప్రస్తుతం రాత్రి 7 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకూ ఉండేది. ఇక కేంద్రం తాజా నిర్ణయంతో ఇక రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకూ పరిమితం చేస్తూ కర్ఫ్యూ అమలులో ఉంటుందని కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది.

 

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.