క‌రోనాను జ‌యించిన ఎస్పీ బాలు

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  7 Sept 2020 5:38 PM IST
క‌రోనాను జ‌యించిన ఎస్పీ బాలు

ప్రముఖ గాయకుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం క‌రోనాను జ‌యించారు. బాలు ఆరోగ్య పరిస్థితిపై ఆయన కుమారుడు ఎస్పీ చరణ్ తాజాగా వీడియో విడుదల చేశారు. నాన్నగారు కోలుకుంటున్నారు. ఆయనకు కరోనా నెగటివ్ వచ్చింది. అయితే ప్రస్తుతం వెంటిలేటర్‌పైనే వైద్యులు చికిత్స అందిస్తున్నారని ఆ వీడియోలో పేర్కొన్నారు.

ఈ వీకెండ్‌న అమ్మానాన్నలు పెళ్లిరోజు సందర్భంగా మేం సెలబ్రేషన్స్ కూడా జరుపుకున్నాం. నాన్న రాయగలుగుతున్నారు. క్రికెట్‌, టెన్నీస్ మ్యాచ్‌లను త‌న ఐఫాడ్‌లో చూస్తున్నారు. ఐపీఎల్ మ్యాచుల కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారని వీడియోలో ఎస్పీ చరణ్ పేర్కొన్నారు. నాన్న‌గారి ఆరోగ్యం కోర‌కు ప్రార్థించిన ప్ర‌తి ఒక్క‌రికి ధ‌న్య‌వాదాలు తెలియ‌జేశారు.

Next Story