ఎస్పీ బాలు అంత్య‌క్రియ‌లు పూర్తి

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  26 Sep 2020 8:08 AM GMT
ఎస్పీ బాలు అంత్య‌క్రియ‌లు పూర్తి

అఖండ భార‌త‌వ‌నిని త‌న గానమాధుర్యంతో ఉర్రూత‌లూగించిన గాన‌గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అంత్యక్రియలు కొద్దిసేప‌టి క్రితం అశ్రున‌య‌నాల న‌డుమ‌ పూర్తయ్యాయి. చెన్నై శివారులోని తామరైపాక్కం ఫామ్ ‌హౌస్‌లో జరిగిన అంత్యక్రియలను ప్రభుత్వ అధికార లాంఛనాలతో నిర్వహించారు. ముందుగా కుటుంబసభ్యులు సంప్ర‌దాయబ‌ద్ధంగా వైదిక క్ర‌తువు పూర్తి చేశాక‌.. శ్రౌత‌ శైవ ఆరాధ్య‌‌ సంప్ర‌దాయం ప్ర‌కారం బాలుని ఖ‌న‌నం చేశారు. దీంతో బాలు అంత్య‌క్రియ‌లు పుర్త‌య్యాయి.

ఇక బాలు అంత్య‌క్రియ‌ల‌కు ఏపీ‌ ప్రభుత్వం తరఫున నీటి పారుదల శాఖ మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ హాజరయ్యారు. తమిళనాడు ఆరోగ్యశాఖ మంత్రితో పాటు సూపర్‌స్టార్‌ విజయ్‌, దేవి శ్రీ ప్ర‌సాద్, మ‌నో, భార‌తీ రాజా‌ మరికొందరు ప్రముఖులు పాల్గొన్నారు. బాలును కడసారి చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున ఫాంహౌస్‌కు చేరుకున్నారు. అయితే.. కోవిడ్ నిబంధనల నేపథ్యంలో పరిమిత సంఖ్యలోనే అంత్యక్రియలకు అనుమతించారు.

Next Story
Share it