శంషాబాద్‌లో రోడ్డు ప్రమాదం.. నుజ్జునుజ్జు అయిన డీసీఎం

By సుభాష్  Published on  27 April 2020 6:52 PM IST
శంషాబాద్‌లో రోడ్డు ప్రమాదం.. నుజ్జునుజ్జు అయిన డీసీఎం

శంషాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసకుంది. ఉల్లిపాయల లోడ్‌తో వెళ్తున్న ఓ డీసీఎం వ్యాన్‌ అతివేగంగా వెళ్తూ అదుపు తప్పి వాటర్‌ ట్యాంకర్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి.

వివరాల్లోకి వెళితే.. కర్నూలు నుంచి హైదరాబాద్‌కు ఉల్లిపాయల లోడ్‌తో వస్తున్న డీసీఎం వ్యాన్‌ శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు పరిధిలోని తొండుపల్లి ఓఆర్‌ఆర్‌ బ్రిడ్జి వద్దకు రాగానే అదుపు తప్పింది. దీంతో ముందువెళ్తున్న వాటర్‌ ట్యాంకర్‌ను వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డీసీఎం ముందు భాగం నుజ్జునుజ్జు అయ్యింది.

విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. క్యాబిన్‌లో ఉన్న ఇద్దరిలో ఒకరు మృతి చెందారు. మరొక వ్యక్తి తీవ్రంగా గాయపడటంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.

Next Story