తెలంగాణలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం పరిధిలోని వేములకొండ మూలమలుపు వద్ద సోమవారం సాయంత్రం వేగంగా వచ్చిన ఓ కారు అదుపుతప్పి రోడ్డుపక్కనే ఉన్న బావిలోకి దూసుకెళ్లింది. కారులో ఇద్దరు వ్యక్తులున్నారు. ఒకరు మృతి చెందగా, ఇంకో వ్యక్తిని కాపాడారు. ప్రమాద విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

స్థానికుల సహాయంతో వారిని తాళ్లతో బయటకు తీశారు. మృతుడు చౌటుప్పల్‌ మండలం అల్లందేవి చెరువు గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు పోలీసులు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

కాగా, దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ ఉన్న కారణంగా రోడ్డు ప్రమాదాలు చాలా వరకూ తగ్గిపోయాయి. రోడ్డు ప్రమాదాలే కాకుండా ఇతర నేరాలు సైతం తగ్గిపోయాయి.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.