'సరిలేరు నీకెవ్వరూ' ఇంటర్వెల్ సీన్.. పిల్లలు దుమ్మురేపారు
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 10 Aug 2020 2:00 PM ISTఆగష్టు 9.. సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు. ఆరోజు పలువురు ప్రముఖులు, అభిమానులు మహేష్ బాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. మహేష్ బాబు చేయనున్న 'సర్కారు వారి పాట' సినిమాకు సంబంధించిన మోషన్ పోస్టర్ ను విడుదల చేశారు. ఇక అభిమానులయితే ఫ్యాన్ మేడ్ పోస్టర్స్ తో రచ్చ రచ్చ చేశారు. ఇక ఆరోజంతా మహేష్ బాబు బర్త్ డే ట్రెండ్ ను అలా కంటిన్యూ చేశారు.
మహేష్ బాబు పుట్టినరోజు నాడు ఓ టీమ్ కూడా స్పెషల్ వీడియోను విడుదల చేసింది. ఇంతకూ ఆ వీడియోలో ఏముందో తెలుసా..? మహేష్ బాబు సూపర్ హిట్ సినిమా అయిన 'సరిలేరు నీకెవ్వరూ' ఇంటర్వెల్ సీన్ స్పూఫ్ వీడియో.
I am truly stunned and pleasently surprised to see the dedication of these kids ... extraordinary.
వీళ్ళు పిల్లలు కాదు పిడుగులు👌😍
(Note: ఇలాంటివి ఎటువంటి జాగ్రత్త లు లేకుండా చేయడం ప్రమాదం జాగ్రత్త పిల్లలూ )https://t.co/lzTUwfdoiQ#SarileruNeekevvaru
— Anil Ravipudi (@AnilRavipudi) August 10, 2020
మహేష్ బాబు మీద అభిమానంతో ఈ పిల్లలంతా కలిసి చేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అవుతోంది. ఇంటర్వెల్ బ్యాంగ్ లో మహేష్ బాబు చెప్పే డైలాగ్స్ ఎంత అభిమానుల రోమాలు నిక్కబొడుచుకునేలా ఉంటాయి. ఈ వీడియోలో కూడా బుల్లి మహేష్ బాబు అంతే అద్భుతంగా తమ అభిమాన హీరోను మక్కీకి మక్కీ దింపేందుకు ప్రయత్నించాడు. డైలాగ్స్ విషయంలోనూ, ఫైట్స్ విషయంలోనూ ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని మరీ రూపొందించారు. స్లో మోషన్ షాట్స్ అయితే చాలా బాగున్నాయి. పిల్లల టీమ్ అయినా కూడా అందరూ బాగా చేశారు. తమ దగ్గర ఉన్న వనరులతో పిల్లలు శెభాష్ అని అనిపించుకుంటూ ఉన్నారు.
ఈ వీడియోను 'సరిలేరు నీకెవ్వరూ' సినిమా దర్శకుడు అనిల్ రావిపూడి చూసి ఇంప్రెస్ అయ్యాడు. తన ట్విట్టర్ ఖాతాలో ఈ వీడియోను పోస్టు చేశాడు. పిల్లలు చూపించిన డెడికేషన్ కు తాను ఆశ్చర్యపోయానని అన్నాడు. 'వీళ్లు పిల్లలు కాదు పిడుగులు' అంటూ చెప్పాడు అనిల్ రావిపూడి. పిల్లలు సీన్స్ లో కొడవలిని, ఎగిరి కిందపడడాలపై జాగ్రత్తలు చెప్పాడు. ఇలాంటివి ఎటువంటి జాగ్రత్త లు లేకుండా చేయడం ప్రమాదం జాగ్రత్త పిల్లలూ అంటూ తన సూచనను ఇచ్చాడు. ఈ స్పూఫ్ వీడియోకు కిరణ్ దర్శకత్వం వహించగా.. లాయిక్ ఎడిటర్ గా వ్యవహరించాడు. ఇక ప్రిన్స్ మహేష్ బాబుగా మున్నా నటించాడు.