నా మొదటి మారుతి కార్ ఎవరి దగ్గరైనా ఉంటే చెప్పండి: సచిన్

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  19 Aug 2020 3:23 PM IST
నా మొదటి మారుతి కార్ ఎవరి దగ్గరైనా ఉంటే చెప్పండి: సచిన్

క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ తన కెరీర్ లో ఎన్నో విజయాలు అందుకున్నారు. ఎన్నో ట్రోఫీలు, గిఫ్ట్ లు సొంతం చేసుకున్నారు సచిన్. ఎన్ని ఉన్నా.. సొంత డబ్బులతో కొన్న మారుతి 800 ఎంతో స్పెషల్ అని చెప్పారు. ఇప్పుడు ఆ కారు తన దగ్గర లేదని.. ఎవరికైనా సమాచారం అందితే తనను సంప్రదించండి అని చెబుతున్నారు సచిన్.

సచిన్ టెండూల్కర్ కు కార్లంటే చిన్నప్పటి నుండి ఎంతో ఇష్టం. మొదట్లో తాను సంపాదించిన డబ్బులతో మారుతి 800ను కొన్నారు. కానీ కొన్ని కారణాల వలన ఆ తర్వాత సచిన్ దగ్గర నుండి ఆ కారు వెళ్ళిపోయింది.. ఇప్పుడు తిరిగి ఆ కారును దక్కించుకోవాలని భావిస్తూ ఉన్నారు.

ముదిత్ దానికి చెందిన 'ఇన్ ది స్పాట్ లైట్' షోలో సచిన్ మాట్లాడుతూ తన మొదటి కారు గురించి ప్రస్తావించారు. ఇప్పుడు ఎవరైతే నేను చెప్పింది విన్నారో.. ఆ కారుకు సంబంధించిన సమాచారం మీకు తెలిస్తే తప్పకుండా సంప్రదించండి అని కోరారు.

భారత మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కు కార్లంటే చాలా ఇష్టం. ఆయన కలెక్షన్లలో గొప్ప గొప్ప కార్లు ఉన్నాయి. చిన్న తనంలోనే సచిన్ కు కార్లంటే ఇష్టం పెరగడానికి కారణం బాంద్రాలో సచిన్ ఇంటి దగ్గర ఉన్న ఓపెన్ డ్రైవ్ సినిమా థియేటర్. అక్కడకు మంచి మంచి కార్లలో పలువురు వస్తూ ఉండే వాళ్లు. ఆ కార్లను సచిన్ తన సోదరుడితో కలిసి చూస్తూ ఉండేవారు. అందుకే చిన్నప్పటి నుండి సచిన్ కు కార్లంటే పిచ్చి. ఇప్పుడు ఎన్నో కోట్ల విలువైన కార్లు సచిన్ టెండూల్కర్ దగ్గర ఉన్నాయి. కానీ తన మొదటి కారు మారుతి 800 మాత్రం ఆయన దగ్గర లేకుండా పోయింది. ఇంతకూ ఆ కారు ఇప్పుడు ఎవరి దగ్గర ఉందో.. సచిన్ మొదటి కారు తిరిగి ఆయన దగ్గరకు చేరుతుందా..?

Next Story