ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్‌షిప్ ఎవరిదంటే?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  18 Aug 2020 9:44 AM GMT
ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్‌షిప్ ఎవరిదంటే?

PL 2020 title sponsor ఇండియన్ ప్రిమియర్ లీగ్ యజమాని బీసీసీఐకి ఈసారి అనుకోని కష్టం వచ్చేసింది. లీగ్‌కు రెండేళ్లుగా టైటిల్ స్పాన్సర్‌గా ఉంటున్న ‘వివో’ మొబైల్ సంస్థ ఈసారి అనివార్య పరిస్థితుల్లో ఆ స్థానం నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. దేశంలో కొన్ని నెలలుగా చైనా వ్యతిరేక ఉద్యమం గట్టిగా నడుస్తున్న నేపథ్యంలో ఆ దేశానికి చెందిన ‘వివో’ను తప్పించాలన్న డిమాండ్లు పెద్ద ఎత్తున వినిపించాయి.

చివరికి ఒత్తిడి తట్టుకోలేక బీసీసీఐ, వివో ఉమ్మడి అంగీకారంతో ఈ ఏఢాదికి ఒప్పందం రద్దు చేసుకున్నాయి. దీంతో నెల రోజుల్లో లీగ్ మొదలు కాబోతుండగా.. కొత్త టైటిల్ స్పాన్సర్‌ను వెతుక్కోవాల్సిన పనిలో పడింది బీసీసీఐ. పది రోజుల కిందటే ఇందుకోసం బిడ్డింగ్ ప్రక్రియను ఆరంభించింది. 14న బిడ్‌ల దాఖలు పూర్తయింది. మంగళవారం టైటిల్ స్పాన్సర్ ఎవరో తేల్చాల్సిన సమయం వచ్చింది.

బీసీసీఐ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు కానీ.. ఈ ఏడాదికి ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్‌గా డ్రీమ్ ఎలెవన్ వ్యవహరించనున్నట్లు సమాచారం. (IPL title sponsor Dream 11 replaces Vivo as IPL 2020 title sponsor, to pay BCCI Rs 222 crore )

అంటే 13వ సీజన్ అంతటా లీగ్‌ను ‘డ్రీమ్ ఎలెవన్ ఐపీఎల్’ అని సంబోధిస్తారన్నమాట. వివో ఈ ఒక్క ఏడాదికి మాత్రమే తప్పుకుంది. వచ్చే ఐపీఎల్ సమయానికి చైనా వ్యతిరేక ఉద్యమం చల్లబడితే.. ఆ సంస్థే మళ్లీ కొనసాగుతుంది.

లేదంటే మళ్లీ బిడ్డింగ్ ప్రక్రియన నిర్వహించడమో.. లేదంటే ప్రస్తుత సంస్థతోనే ఒప్పందాన్ని కొనసాగించడమో జరుగుతుంది. క్రికెట్ మ్యాచ్‌ల మీద బెట్టింగ్ తరహాలో గేమ్ నిర్వహించి కోట్లమందిని ఇన్వాల్వ్ చేస్తూ వేల కోట్ల టర్నోవర్‌ స్థాయికి ఎదిగింది ‘డ్రీమ్ ఎలెవన్’.

ఈ సంస్థతో ఐపీఎల్ ఒప్పందం మంగళవారంతో మొదలై డిసెంబరు 31 వరకు.. అంటే నాలుగు నెలలు మాత్రమే కొనసాగుతుంది. వివో సంస్థ ఏడాదికి రూ.440 కోట్లు చెల్లించేది. మరి డ్రీమ్ ఎలెవెన్ ఎంతకు ఒప్పందం దక్కించుకుందో ఇంకా వెల్లడి కాలేదు. ఈ డీల్ రూ.300 కోట్లకు అటు ఇటుగా ఉంటుందని అంచనా.

Next Story