నెహ్రూ జూలాజికల్ పార్క్ లో పెద్ద పులి కదంబ మృతి..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  5 July 2020 9:44 PM IST
నెహ్రూ జూలాజికల్ పార్క్ లో పెద్ద పులి కదంబ మృతి..!

నెహ్రూ జూలాజికల్ పార్క్ లో 11 సంవత్సరాల రాయల్ బెంగాల్ టైగర్ కదంబ మరణించింది. జులై 4న హార్ట్ ఫెయిల్యూర్ కారణంగా కదంబ మరణించినట్లు జూ పార్క్ అధికారులు తెలిపారు. అనిమల్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్ లో భాగంగా కదంబను మార్చి 6, 2014లో మంగళూరు లోని పిలుకుల బయోలాజికల్ పార్క్ నుంచి తీసుకుని వచ్చారు.

కదంబ ఏదైనా రోగంతో బాధపడుతూ ఉన్నట్లు అసలు అనిపించలేదని జూ సిబ్బంది తెలిపింది. కానీ గత కొద్దిరోజులుగా తినడం ఆపేసింది జూ అధికారులు తెలిపారు. దీంతో కదంబను అబ్జర్వేషన్ లో ఉంచారు. ఇంతలో కదంబ చనిపోయింది. పోస్టుమార్టం రిపోర్ట్ లో కదంబ హార్ట్ ఫెయిల్యూర్ లో మరణించినట్లు తెలిసింది. బ్లడ్, టిష్యూ శాంపుల్స్ ను సేకరించిన అధికారులు రాజేందర్ నగర్ లోని వెటర్నరీ సైన్స్ కాలేజీకి, శాంతి నగర్ లోని వెటర్నరీ బయోలాజికల్ రీసర్చ్ ఇన్స్టిట్యూట్(విబిఆర్ఐ) కు, అత్తాపూర్ లోని LaCONES-CCMB కు పంపారు.

హైదరాబాద్ జూలో గత 10 రోజుల వ్యవధిలో రెండు పెద్ద పులులు మృత్యువాత పడ్డాయి. కొన్నిరోజుల కిందట కిరణ్ అనే పులి మరణించింది. దాని వయసు 8 సంవత్సరాలు. కిరణ్ నియోప్లాస్టిక్ కణితి కారణంగా జూన్ 25న కన్నుమూసిందని జూ వర్గాలు తెలిపాయి. నెహ్రూ జూలాజికల్ పార్క్ లో మొత్తం 11 రాయల్ బెంగాల్ పులులు(పసుపు) ఉన్నాయి. వాటిలో ఎనిమిది పెద్దవి కాగా.. మూడు పిల్లలు ఉన్నాయి. తొమ్మిది రాయల్ బెంగాల్ టైగెర్స్(తెలుపు) కూడా ఉన్నాయి. మూడు పసుపు రాయల్ బెంగాల్ పులులు రోజా(21), సోనీ(20), అపర్ణ(19) లు సగటు వయసు కంటే ఎక్కువగానే బ్రతికాయి. ప్రొఫెసర్ లక్ష్మణ్ టీమ్ సారథ్యంలో కదంబ పోస్ట్ మార్టంను నిర్వహించారు.

Next Story