ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి
By తోట వంశీ కుమార్ Published on 24 July 2020 7:26 PM ISTహైదరాబాద్ విజయవాడ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సూర్యాపేట జిల్లా మునగాల మండలం, మొద్దుల చెరువు వద్ద రహదారి పక్కన నిల్చున్న వారిని వెనుక నుంచి వచ్చిన మరో కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో చిన్నారి సహా ముగ్గురు స్పాట్‌లోనే మృతి చెందారు. మరొకరికి గాయాలయ్యారు. మృతులను కృష్ణా జిల్లా కృత్తివెన్ను మండలం ఇంటేరు గ్రామానికి చెందిన నాగ కోటేశ్వరావు, దుర్గ, మొగలమ్మగా గుర్తించారు.
వీరంతా విజయవాడ నుంచి హైదరాబాద్ వెలుతున్నట్లు తెలుస్తోంది. కారులో ఐదుగురు ఉన్నారు అయితే డ్రైవర్ కార్ లో నుండి కిందకు దిగక పోవడం వలన డ్రైవర్ కు ఏమీ కాలేదు. ఇటియోస్ కార్ ని.. వెనకనుండి క్రెట్టా కారు ఢీకొన్నది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపడుతున్నారు.
Next Story