బెజవాడలో సినీ ఫక్కీలో భారీ చోరీ.. 7కేజీల బంగారం, రూ.30లక్షలు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  24 July 2020 9:58 AM GMT
బెజవాడలో సినీ ఫక్కీలో భారీ చోరీ.. 7కేజీల బంగారం, రూ.30లక్షలు

బెజవాడలో సినిమా ఫక్కీలో భారీ చోరీ జరిగింది. ఓ జ్యూవెలరీ షాపులో చొరబడిన దుండగులు షాపులోని గుమస్తా కాళ్ళు చేతులు కట్టేసి దోపిడికి పాల్పడ్డారు. ఈ ఘటన విజయవాడ వన్‌టౌన్ కాటూరి వారి వీధిలో జరిగింది.

వివరాల్లోకి వెళితే.. కాటూరి వారి వీధిలో ఉన్న సాయి జ్యూవెలరీ షాపుకు శుక్రవారం కొందరు గుర్తు తెలియని దుండగులు వచ్చారు. షాపులో ఉన్న గుమస్తా కాళ్ళు, చేతులు కట్టేసి దోపిడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో 7 కేజీల బంగారం, రూ.30లక్షలు చోరికి గురైనట్లు షాపు యజమాని తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. అయితే ఆభరణాలు తయారుచేసేవారే చోరీకి పాల్పడ్డారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Next Story