నేటి నుంచే ఉచిత బియ్యం పంపిణీ.!
By అంజి
హైదరాబాద్: కరోనా నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రజలకు ఇవాళ్టి నుంచి ఉచితంగా రేషన్ బియ్యం పంపిణీ చేయనున్నారు. ప్రతి ఒక్కరికి 12 కిలోల చొప్పున బియ్యం ఇవ్వాలని సీఎం కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. బియ్యం పంపిణీకి చేపట్టాల్సిన చర్యలపై పౌరసరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, పౌరసరఫరాల శాఖ కమిషనర్ పీ. సత్యనారాయణరెడ్డి, అధికారులతో మంత్రి గంగుల కమలాకర్ ఇప్పటికే సమీక్ష నిర్వహించారు.
Also Read: కరోనాపై పోరు.. వ్యాక్సిన్ కోసం రంగంలోకి జాన్సన్ అండ్ జాన్సన్
నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు రేషన్ బియ్యం అందజేయనున్నారు. రాష్ట్రంలో 1.09 కోట్ల కుటుంబాలు ఉన్నాయి. అందులో 87.59 లక్షల కుటుంబాలకు రేషన్ కార్డులు ఉన్నాయి. ఆ కార్డుల ద్వారా సుమారు 2.81 కోట్ల లబ్దిదారులకు రేషన్ బియ్యం అందుతాయి. రేషన్ దుకాణాలు ఉదయం నుంచి సాయంత్ర వరకు పని చేసేలా చర్యలు తీసుకుంటున్నట్టు పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమాలకర్ తెలిపారు.
Also Read: కరోనా కేసులపై మర్కజ్ నిజాముద్దీన్ అధికారిక ప్రకటన
రేషన్ బియ్యంతో పాటు నిత్యావసరాల సరుకులు కొనుక్కునేందుకు ప్రతి రేషన్ కార్డుకు రూ.1500 చొప్పున పంపిణీ చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించిన విషయం తెలిసిందే. నిధుల పంపిణీకి ఈ-కుబేర్ సాప్ట్‌వేర్ వాడనున్నారని సమాచారం. ఉచితంగా రేషన్ ఇస్తున్నందుకు రాష్ట్ర ప్రభుత్వంపై రూ.1,103 కోట్ల భారం పడుతోందని గంగుల చెప్పారు. బియ్యం పంపిణీ పర్యవేక్షణను జిల్లా కలెక్టర్లకు అప్పగించారు. లబ్దిదారులకు కూపన్ల ఆధారంగా రేషన్ బియ్యం పంపిణీ చేయనున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో భౌతిక దూరం పాటించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. రేషన్ దుకాణాల దగ్గర శానిటైజర్లు, సబ్బులు ఉండాలని మంత్రి గంగుల ఆదేశించారు.
Also Read: ‘సొంతదేశానికి సాయం చేయాల్సింది పోయి’.. యువీపై నెటీజన్ల పైర్