'సొంత‌దేశానికి సాయం చేయాల్సింది పోయి'.. యువీపై నెటీజ‌న్ల పైర్‌

By తోట‌ వంశీ కుమార్‌  Published on  31 March 2020 3:46 PM GMT
సొంత‌దేశానికి సాయం చేయాల్సింది పోయి.. యువీపై నెటీజ‌న్ల పైర్‌

భార‌త మాజీ ఆల్‌రౌండ‌ర్ యువ‌రాజ్ సింగ్‌ని సోష‌ల్ మీడియాలో అభిమానులు తెగ ట్రోల్ చేస్తున్నారు. యువ‌రాజ్ సింగ్ చేసిన ఓ పోస్టే అందుకు కార‌ణం. భార‌త్‌లో క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభిస్తోంది. ఇప్ప‌టి వ‌ర‌కు 45 మంది మృత్యువాత ప‌డ‌గా.. 1418 మంది క‌రోనా పాజిటివ్‌తో ఆస్ప‌త్రుల్లో చికిత్స పొందుతున్నారు. క‌రోనా క‌ట్ట‌డి కోసం ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ 21 రోజుల పాటు దేశ వ్యాప్త లాక్‌డౌన్‌కు పిలుపునిచ్చిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో బాధితుల‌ను ఆదుకోవ‌డం కోసం, క‌రోనా క‌ట్ట‌డికి సినీ, క్రీడా ప్ర‌ముఖుల‌తో పాటు సామాన్యులు కూడా త‌మ వంతు సాయం చేస్తున్నారు. కాగా.. ఇప్ప‌టి వ‌ర‌కు యువరాజ్ సింగ్ ఎలాంటి విరాళం ప్రకటించలేదు.

తాజాగా యువీ సోష‌ల్‌మీడియాలో ఓ వీడియో పోస్టు చేశాడు. పాకిస్థాన్‌లో కరోనా వైరస్ కట్టడి కోసం ఆ దేశ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది ఫౌండేషన్‌కి చేతనైనంత సాయం చేయాల‌ని అభిమానుల‌కు సూచించాడు. దీంతో నెటీజ‌న్లు యువ‌రాజ్‌ను ఉతికి ఆరేస్తున్నారు.

భారత్‌లో కరోనా కట్టడి కోసం సాయం చేయాల్సిందిపోయి.. శత్రు దేశమైన పాకిస్థాన్‌కి మద్దతుగా నిలుస్తావా..? అంటూ నెటిజన్లు ఉతికారేస్తున్నారు. నీకు బుర్ర ఉండే మాట్లాడుతున్నావా..? అంటూ భారత్ అభిమానులు యువీపై పెద్ద ఎత్తున విరుచుకుపడుతున్నారు.



ఇదిలా ఉంటే.. భారత్‌లో కరోనా వైరస్ కట్టడి కోసం క్రికెటర్లు హిట్‌మ్మాన్ రోహిత్ శర్మ రూ. 80 లక్షలు, సురేశ్ రైనా రూ. 52 లక్షలు, సచిన్ టెండూల్కర్ రూ. 50 లక్షలు, బీసీసీఐ అధ్య‌క్షుడు రూ.50ల‌క్ష‌లు, అజింక్య రహానె రూ. 10 లక్షలు విరాళంగా ప్రకటించ‌గా.. భార‌త కెప్టెన్ విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మతో కలిసి రూ. 3 కోట్లు విరాళం ప్రకటించినట్లు తెలుస్తోంది. ఇక ధోనీ రూ. 1 లక్ష విరాళం ప్రకటించినట్లు వార్తలు వస్తుండగా.. అదీ ఓ ట్రస్ట్‌కి అందజేసినట్లు తెలుస్తోంది.

రూ. 800 కోట్లు విలువైన ఆస్తులున్న ధోనీ రూ. లక్ష విరాళం ప్రకటించడంపై విమర్శలు గుప్పించిన అభిమానులు.. ఇప్పుడు యువీ కంటే ధోనీనే న‌య‌మంటున్నారు.



Next Story