క‌రోనా వైర‌స్‌(కొవిడ్‌-19) ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తోంది. ఈ మ‌హ‌మ్మారి భారీన ప‌డి ఎంతో మంది ప్రాణాలు కోల్పోగా.. ల‌క్ష‌ల మంది బాధితులు ఆస్ప‌త్రుల్లో చికిత్స పొందుతున్నారు. వైద్యులు, పారామెడిక‌ల్ సిబ్బంది, పోలీసులు.. ఇలా ఎంద‌రో ప్ర‌జ‌లను క‌రోనా బారి నుంచి కాపాడేందుకు రేయింబ‌వ‌ళ్లు శ్ర‌మిస్తూ, కంటికి క‌నిపించ‌ని మ‌హమ్మారితో అనునిత్యం యుద్ధం చేస్తున్నారు. వీరంద‌రికీ మ‌ద్ద‌తు తెలుపుతూ ఆస్ట్రేలియ‌న్ స్టార్ క్రికెట‌ర్‌ డేవిడ్ వార్న‌ర్‌ వినూత్న చాలెంజ్‌ను ఆవిష్క‌రించాడు. దీనికి నెటీజ‌న్ల నుంచి మంచి స్పంద‌న వ‌స్తోంది. వారి పోరాటాన్ని కీర్తిస్తూ ఈ క్రికెట‌ర్ గుండు గీసుకున్నాడు.

ట్రిమ్మ‌ర్ స‌హాయంతో స్వతాహాగా గుండు గీసుకున్నాడు. ఆ వీడియోను త‌న ఇన్‌స్టాగ్రామ్ లో పోస్టు చేశాడు.క రోనా వైర‌స్‌పై పోరాడుతున్న‌వారికి మద్ద‌తుగా నిల‌వాల‌ని, ఇందుకోసం త‌న త‌ల‌ను షేవ్ చేసుకోవాల‌ని నామినేట్ చేశార‌ని గుర్తు చేశాడు. భార‌త కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఆస్ట్రేలియా క్రికెట‌ర్ స్టీవ్ స్మిత్ తో పాటు మ‌రో ఏడుగురికి ఈ స‌వాల్ విసిరాడు. అస‌లే జుట్టుతో ఎన్నో ప్ర‌యోగాలు చేసే విరాట్ ఈ చాలెంజ్ స్వీక‌రిస్తాడో లేదో చూడాలి.

భార‌త దేశంలో కూడా క‌రోనా వైర‌స్ రోజురోజుకు విస్త‌రిస్తోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా 1418 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు కాగా.. 45 మంది మ‌ర‌ణించారు. క‌రోనా వ్యాప్తిని అడ్డుకోవాల‌ని భార‌త ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ 21 రోజుల‌పాటు లాక్ డౌన్ చేసిన సంగ‌తి తెలిసిందే


వంశికుమార్ తోట

నాపేరు వంశికుమార్. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, ఆంధ్ర‌జ్యోతిలో పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.