ప్రధాని మోడీకి ఎంపీ రేవంత్‌రెడ్డి లేఖ..అందులో ఏముదంటే..!

By Newsmeter.Network  Published on  8 Dec 2019 2:30 PM IST
ప్రధాని మోడీకి ఎంపీ రేవంత్‌రెడ్డి లేఖ..అందులో ఏముదంటే..!

చట్టసభల్లో ఆంగ్లో ఇండియన్స్ ప్రాతినిధ్యం తప్పనిసరి అని, రాజ్యాంగం మేరకు ఆయా శాసనసభ, పార్లమెంట్‌లో చోటు కల్పిస్తారని, కానీ వారి ప్రాతినిధ్యం అవసరం లేదని కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి అన్నారు. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్రమోడీకి లేఖ రాశారు. చట్టసభల్లో ఆంగ్లో ఇండియన్ల స్థానంలో థర్డ్ జెండర్స్‌కి రిజర్వేషన్ కల్పించాలని కోరారు. ఆంగ్లో ఇండియన్ కోటాను థర్డ్ జెండర్లకు దక్కేలా సవరణ చేయాలని ఆయన లేఖలో ప్రధానికి విజ్ఞప్తి చేశారు. అంతేకాదు ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లను మరో పదేళ్ల పాటు పొడిగిస్తూ రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 344కు శీతాకాల సమావేశాల్లోనే సవరణ చేయనున్నారు. సమాజం తమను చిన్న చూపు చూస్తోందన్న భావన దేశంలో లక్షలాదిగా ఉన్న థర్డ్‌ జెండర్లలో ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. రాజకీయ ప్రాతినిధ్యంలోనూ వారు అన్యాయాన్ని ఎదుర్కొంటున్నారని లేఖలో చెప్పుకొచ్చారు. ఇదే ఆర్టికల్‌లో ఉన్న ఆంగ్లో ఇండియన్ల రిజర్వేషన్లను తొలగించి థర్డ్‌ జెండర్లకు రిజర్వేషన్‌ కల్పిస్తూ సవరణను చేర్చాలని కోరారు. దీని కోసం అదనపు కోటా సృష్టించాల్సిన అవసరం ఉండబోదని చెప్పారు. థర్డ్‌ జెండర్లకు తమ సమస్యలను చట్ట సభల్లో వినిపించే అవకాశం దక్కుతుందని రేవంత్‌రెడ్డి లేఖలో పేర్కొన్నారు. కాగా, ఇప్పుడు రేవంత్‌ రెడ్డి అకస్మాత్తుగా థర్డ్ జెండర్స్ పేరు తెరపైకి తీసుకురావడం చర్చకు దారితీసింది. వారిపై ఆయనకు నిజంగా మంచి అభిప్రాయం ఉందా అనే చర్చ మొదలైంది.



Next Story