సెప్టెంబర్ 1 నుండి రేషన్ డోర్ డెలివరీ
By తోట వంశీ కుమార్ Published on 9 May 2020 11:40 AM ISTప్రజా పంపిణీ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి. రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి నాణ్యమైన బియ్యం ఇస్తామని ఇప్పటికే ప్రకటించిన సీఎం పౌరసరఫరాల శాఖ అధికారులతో సమీక్ష సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలో సెప్టెంబరు 1 నుంచి ఇంటింటికీ నాణ్యమైన బియ్యం సరఫరా చేయాలని అధికారులను ఆదేశించారు. అదే రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకాన్ని అమలులోకి తీసుకురావాలన్నారు.
బియ్యంలో నాణ్యత, పంపిణీలో పారదర్శకతే తమ ప్రభుత్వ ధ్యేయమని అధికారులకు దిశానిర్దేశం చేశారు. అవినీతికి పూర్తిస్థాయిలో అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా పథకం అమలు చేయాలని సూచనలు చేశారు. అంతేకాకుండా, బియ్యం కోసం లబ్దిదారులకు నాణ్యమైన సంచులు కూడా అందిస్తామని తెలిపారు. ప్రతి నెల 2.3 లక్షల నాణ్యమైన బియ్యం డోర్ డెలివరీ చేయనున్నట్టు అధికారులు వివరించారు
ఈ సందర్భంగా అధికారులు సీఎం జగన్ కు పలు అంశాలు నివేదించారు. గ్రామసచివాలయాల్లో 13,370 మొబైల్ యూనిట్లు ఉన్నాయని, మొబైల్ యూనిట్ లోనే ఎలక్ట్రానిక్ కాటా ఉంటుందని తెలిపారు. లబ్ధిదారుల ముందే బస్తా సీల్ తీసి కోటా బియ్యం అందిస్తామని చెప్పారు. అంతేకాకుండా, బియ్యం కోసం లబ్ధిదారులకు నాణ్యమైన సంచులు కూడా అందిస్తామని తెలిపారు. ప్రతి నెల 2.3 లక్షల టన్నుల నాణ్యమైన బియ్యం డోర్ డెలివరీ చేయనున్నట్టు అధికారులు వివరించారు.
ఇప్పటికే పైలట్ ప్రాజెక్టు కింద శ్రీకాకుళం జిల్లాలో గత ఏడాది సెప్టెంబర్ 6 నుంచి నాణ్యమైన బియ్యాన్ని డోర్ డెలివరీ చేస్తుంది ప్రభుత్వం . అర్హులైన లబ్ధిదారుల జాబితాను గ్రామ వాలంటీర్లు తయారు చేసి, లబ్దిదారులకు బియ్యం కార్డులు అందజేసి వారికే డైరెక్ట్ గా ఇంటికే బియ్యాన్ని పంపించేందుకు కావాల్సిన ఏర్పాట్లు చేయబోతున్నారని పేర్కొన్నారు.