ఏపీలో వలస కూలీల ఆందోళన.. రాత్రంతా రోడ్డుపైనే బైఠాయింపు

By సుభాష్  Published on  9 May 2020 3:54 AM GMT
ఏపీలో వలస కూలీల ఆందోళన.. రాత్రంతా రోడ్డుపైనే బైఠాయింపు

దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి వల్ల ఎన్నో నష్టాలు చావిచూడాల్సిన దుస్థితి ఏర్పడింది. కరోనాను కట్టడి చేసేందుకు దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో దేశంలోని అన్ని రాష్ట్రాలతో పాటు ఏపీలో కూడా కరోనా పాజిటివ్‌ కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. లాక్‌డౌన్‌ కారణంగా వలస కూలీలకు ప్రాణసంకటంగా మారింది. చేసేందుకు పనులు లేక, తినేందుకు తిండిలేక నానా అవస్థలకు గురవుతున్నారు. వలస కూలీల కష్టాలను దృష్టిలో ఉంచుకుని ఇటీవల కేంద్ర ప్రభుత్వం కొన్ని సడలింపులు ఇచ్చింది.

అందులో వలస కూలీలను స్వస్థలాలకు పంపేందుకు అంగీకరించింది. దీంతో ఆయా రాష్ట్రాల్లో చిక్కుకున్నవారిని సొంతూళ్లకు తరలిస్తున్నారు అధికారులు. ఇక ఏపీలోని నెల్లూరుకు వలసగా వచ్చిన బీహార్‌ కూలీలు ఆందోళన చేపట్టారు. రాత్రంతా రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. తమను స్వస్థలాలకు పంపించాలని ఆందోళనకు దిగారు. అధికారులు సొంతూళ్లకు పంపిస్తామని హామీ ఇచ్చినా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆందోళన బాట పట్టారు. రాత్రంతా కూడా రోడ్డుపైనే బైఠాయించి ఉండిపోయారు.

కాగా, ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన వలస కూలీలను ప్రభుత్వాలు స్వస్థలాలకు తరలించారు. కూలీల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక రైళ్లలకు సొంతూళ్లకు చేరుకున్నారు. కొన్ని ప్రాంతాల్లో కొందరు అలాగే ఉండిపోయారు. అయితే ఏపీలో కొన్ని జిల్లాల్లో రోడ్‌ జోన్‌ ఉండటం కారణంగా వారిని తరలించేందుకు అనుమతి లేదని అధికారులు చెబుతున్నారు. కరోనా వైరస్‌ తగ్గుముఖం పట్టిన తర్వాత ఖచ్చితంగా సొంతూళ్లకు పంపిస్తామని వలస కూలీలకు నచ్చచెబుతున్నారు పోలీసులు. అయినా వారు ఆందోళన ఏ మాత్రం విరమించడం లేదు. దీంతో పోలీసులకు ఇదొక తలనొప్పిగా మారింది.

Next Story