2015లో చేసిన డబ్ స్మాష్.. ఇప్పుడు వైరల్ అవుతోంది..

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  29 May 2020 1:17 PM GMT
2015లో చేసిన డబ్ స్మాష్.. ఇప్పుడు వైరల్ అవుతోంది..

రానా - రామ్ చరణ్ మంచి స్నేహితులే కాకుండా..మంచి క్లాస్ మేట్స్, సహ నటులు కూడా. వీరిద్దరి మధ్యే కాదు..దగ్గుబాటి - కొణిదెల వారి కుటుంబాల మధ్యన కూడా మంచి సాన్నిహిత్యం ఉంది. రామ్ చరణ్ ఇప్పటి వరకూ అన్నీ హీరో పాత్రలే పోషించినా..రానా మాత్రం హీరోగా కెరీర్ మొదలు పెట్టి విలన్ గా కూడా రాణించాడు. నిజానికి హీరో కంటే విలన్ పాత్రలు పోషించిన సినిమాలే కాస్త హిట్లు తీసుకొచ్చాయి. బాహుబలి - 1, 2 సినిమాలతో రానా కూడా పాన్ ఇండియా లెవల్ యాక్టర్ గా పేరు గడించారు.

మగధీర సినిమా వచ్చిన కొత్తలో రామ్ చరణ్ - రానా కలిసి ఓ డబ్ స్మాష్ చేశారు. ఇప్పుడు టిక్ టాక్ ఎంత ఫేమస్ అయిందో..అప్పట్లో డబ్ స్మాష్ అంత ఫేమస్. అప్పట్లో మగధీర సినిమాలోని పవర్ ఫుల్ డైలాగ్ అయిన ఒక్కొక్కడిని కాదు షేర్ ఖాన్..వందమందిని ఒకేసారి రమ్మను అని చెర్రీ చెప్పిన డైలాగ్ కు వీరిద్దరూ 2015 జూన్ 7న చేసిన డబ్ స్మాష్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది.

ప్రస్తుతం రామ్ చరణ్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఆర్ఆర్ఆర్ సినిమాలో అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నాడు. రానా అరణ్య సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. కాగా ఇటీవలే రానా తన లవ్ గురించి కూడా అందరికీ చెప్పేశాడు. అంతేకాక ఇరు కుటుంబాల మధ్య ఎంగేజ్ మెంట్, పెళ్లికి సంబంధించిన విషయాలు చర్చించేందుకు రోకా ఫంక్షన్ కూడా జరిగింది. ఇక త్వరలోనే రానా ఓ ఇంటివాడు కాబోతున్నాడన్న సంగతి తెలిసిందే.



Next Story