కేటీఆర్‌కు ర‌కుల్ బ‌ర్త్‌డే శుభాకాంక్ష‌లు

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  24 July 2020 6:03 AM GMT
కేటీఆర్‌కు ర‌కుల్ బ‌ర్త్‌డే శుభాకాంక్ష‌లు

తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ‌ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు(కేటీఆర్‌) జన్మదినోత్సవం నేడు. ఈ సందర్భంగా పలువురు సినీ, రాజ‌కీయ రంగాల‌కు చెందిన‌‌ ప్రముఖులు ఆయనకు సోషల్ మీడియా వేదిక‌గా శుభాకాంక్ష‌లు తెలుపుతున్నారు. అయితే.. టాలీవుడ్ హీరోయిన్‌ల‌లో ఒక‌రైన‌ ఢిల్లీ భామ.. రకుల్ ప్రీత్ సింగ్ కూడా కేటీఆర్‌కు ట్విటర్ వేదిక‌గా బ‌ర్త్‌డే శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు.

ర‌కుల్ త‌న ట్వీట్‌లో.. హ్యాపీ హ్యాపీ బర్త్‌డే కేటీఆర్. ఈ సంవత్సరమంతా మీరు సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలి. మన రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేయడానికి కావాల్సిన మరింత బలం, సామర్థ్యం మీకు చేకూరాలని కోరుకుంటున్నా. మీరు దూరదృష్టి ఉన్న నిజమైన నాయకుడు. మీరు ఇలాగే ముందుకు సాగాలి అని రాసుకొచ్చింది.



ఇదిలావుంటే.. తెలుగులో కెరటం సినిమాతో ఆరంగేట్రం చేసిన ఈ అమ్మ‌డు వ‌రుస అవ‌కాశాల‌తో దూసుకుపోతుంది. ఆ త‌రువాత వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్, రఫ్, లౌక్యం, కరెంట్ తీగ, పండగ చేస్కో, కిక్ 2, బ్రూస్ లీ, నాన్నకు ప్రేమతో, సరైనోడు, ధృవ, విన్నర్, రారండోయ్ వేడుక చూద్దాం, జయ జానకీ నాయకా, స్పైడర్, మ‌న్మ‌ధుడు -2 వంటి చిత్రాల‌లో న‌టించింది.

Next Story