ఖబర్ధార్: పవన్ కల్యాణ్‌కు వార్నింగ్ ఇచ్చిన 'రాజాసింగ్'
By Newsmeter.Network
జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద దుమారం రేపుతున్నాయి. హిందూ మతంపై మాట్లాడడం తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. పవన్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్రంగా ఖండించారు. హిందూమతం, ధర్మం గురించి కనీస అవగాహన లేకుండా పవన్ మాట్లాడటం సరికాదన్నారు. పవన్ ఏ మతానికి చెందిన వారని, ఇతర మతానికి మారిపోయారా? అని రాజాసింగ్ ప్రశ్నించారు. హిందూ మతాన్ని టార్గెట్‌గా చేసిన మట్లాడం సరైందని కాదని, లౌకికతత్వంపై పవన్‌కు కనీస అవగాహన లేదని ఆరోపించారు. పవన్ చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని రాజాసింగ్ డిమాండ్ చేశారు. లేకపోతే మున్ముందు ఇబ్బందులు పడాల్సి వస్తుందని, ఖబర్దార్ పవన్ అంటూ హెచ్చరించారు.
కాగా, సోమవారం పవన్ కల్యాణ్ తిరుపతిలో నిర్వహించిన ఓ సమావేశంలో మాట్లాడుతూ.. మత రాజకీయాలు ఆడేది హిందూ రాజకీయ నేతలేనని, మతాల మధ్య గొడవపెట్టేది హిందూ నాయకులేనని పవన్ ఆరోపించారు. ఇతర మతాల నేతలు ఇలాంటి పనులు చేయరని వ్యాఖ్యనించారు. అలాగే టీటీడీలో అన్యమత ప్రచారం చేయిస్తోంది హిందువులేనని ఆరోపణలు గుప్పించారు. హిందూ నాయకుల ప్రేరణ లేనిదే ఇలాంటివి జరగవని చెప్పుకొచ్చారు పవన్. తాను చిన్నప్పటి నుంచి వింటోంది ఒకటేనని..సెక్యులరిజాన్ని ఇబ్బంది పెడుతోంది హిందూవులు మాత్రమేనని వ్యాఖ్యానించారు. ఇలాంటి వ్యాఖ్యలు చేసిన పవన్ ఇప్పుడు సంచలనంగా మారింది. పవన్ చేసిన వ్యాఖ్యల వల్ల పలు వర్గాల నుంచి తీవ్ర స్థాయిలో వ్యతిరేకత ఎదురవుతోంది.