ఏపీలో భారీ వ‌ర్షాలు ప‌డే అవ‌కాశం ఉన్న‌ట్లు అమరావతిలోని వాతావరణ కేంద్రం తెలిపింది. వ‌చ్చే 48 గంటల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్న‌ట్లు వాతావ‌ర‌ణ శాఖ‌ పేర్కొంది. గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని.. రాయలసీమలో ఉరుములు, మెరుపులతోపాటు తేలికపాటి వానలు పడే అవకాశం ఉందని వాతావ‌ర‌ణ అధికారి వెల్ల‌డించారు.

ప‌గ‌లు ఉష్ణోగ్ర‌తలు అధికంగా ఉంటాయ‌ని.. ప్ర‌ధానంగా విశాఖపట్టణం, తూర్పుగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశమున్న‌ట్లు.. దీని కార‌ణంగా ప‌లు చోట్ల పిడుగులు పడే అవకాశం ఉందని.. అందరూ అప్రమత్తంగా ఉండాలని వాతావ‌ర‌ణ శాఖ‌ హెచ్చరించింది. ఇక‌, ఈ నెల 30న దక్షిణ అండమాన్ సముద్రం, దాని పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని.. అది మరింత తీవ్రంగా మరే అవకాశం ఉందని భార‌త వాతావ‌ర‌ణ శాఖ‌ పేర్కొంది.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.