ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభిస్తోంది. రాష్ట్రంలో రోజు రోజుకు కేసుల సంఖ్య పెరుగుతూనే ఉన్నాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో కొత్త‌గా మ‌రో 81 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. వీటితో క‌లిపి ఇప్ప‌టి వ‌ర‌కు రాష్ట్రంలో క‌రోనా కేసుల సంఖ్య 1097 కి చేరింది. మొత్తం కేసుల్లో 231 మంది కోల‌కుని డిశ్చార్జి కాగా.. 835 మంది ఆస్ప‌త్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ మ‌హ‌మ్మారి భారీన ప‌డి ఇప్ప‌టి వ‌ర‌కు రాష్ట్రంలో 31 మంది మృత్యువాత ప‌డ్డారు.

కొత్త‌గా న‌మోదైన కేసుల్లో అత్య‌ధికంగా కృష్ణా జిల్లాలో 52 పాజిటివ్ కేసులు న‌మోదు కాగా.. ప‌శ్చిమ‌ గోదావ‌రి 12, క‌డ‌ప 3, అనంత‌ర‌పురం 2, తూర్పుగోదావ‌రి 2, గుంటూరు 3, ప్ర‌కాశంలో 3 కేసులు న‌మోద‌య్యాయి. ఇక రాష్ట్రంలో అత్య‌ధికంగా ఇప్ప‌టి వ‌ర‌కు కర్నూలు జిల్లాలో 279 కేసులు, గుంటూరు214, కృష్ణా జిల్లాలో 177 పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి.

Corona updates in AP

వంశికుమార్ తోట

నాపేరు వంశికుమార్. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, ఆంధ్ర‌జ్యోతిలో పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.