రాముడి గురించి రాహుల్ ఆసక్తికర ట్వీట్
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 5 Aug 2020 4:55 PM IST
ఓవైపు అంగరంగ వైభవంగా రామాలయ శంకుస్థాపన జరుగుతోంది. దశాబ్దాల కల నెరవేరిందని మందిర నిర్మాణం ప్రారంభమవుతోందని మోదీ సహా పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా రాముడి విశిష్టతలను గురించి చెప్తూ కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ ఓ ఆసక్తికర ట్వీట్ చేశారు. రాముడంటే మానవత్వమని.. ఉత్తమ మానవీయ విలువలు కలిగిన వాడని రాహుల్ గాంధీ తన ట్వీట్‌లో చెప్పుకొచ్చారు.
మనుష్యుల హృదయాల్లో దాగి ఉన్న మానవత్వానికి శ్రీరాముడి మనవీయ విలువలే కారణమని రాహుల్ అన్నారు. రాముడంటే ప్రేమ.. ప్రేమించడం తప్ప, అసహ్యించుకోవడం తెలియదు. రాముడంటే అప్యాయత.. జాలి చూపడమే కానీ హింసించడం తెలియదు. రాముడంటే న్యాయం. అన్యాయాన్ని ఏమాత్రం సహించడు అంటూ రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.
Next Story