రాశిఫలాలు : మే 31 ఆదివారం నుండి జూన్ 6 శనివారం వరకు

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  31 May 2020 4:44 AM GMT
రాశిఫలాలు : మే 31 ఆదివారం నుండి జూన్ 6 శనివారం వరకు

మేషరాశి :- ఈ రాశి వారికి విశేష ధన లాభాదులు ఉన్నాయి అయితే రాజకీయ చిక్కులు శతృవృద్ధి ఉండడం వల్ల కించిత్ భయాన్ని శ్రమను అనుభూతి పొందబోతున్నారు. వారు ప్రారంభంలోనే వీరికి ఇబ్బందులున్నా వారం మధ్యలో శుభఫలితాలు పొందగలరు. వారం చివర్లో మల్లా ఇబ్బందులు బాగా ఎదుర్కోవాల్సి వస్తుంది. అనారోగ్య సూచనలు, ప్రాణభయం కూడా ఉంది. వక్రంలో నున్న గురు ప్రభావంచేత కొన్ని సమస్యలనుండి బయట పడతారు. ద్వితీయ మందున్న శుక్రుడు వక్రించి ఆకస్మిక ధనలాభం లేదా పాత బాకీలు వసూలు చేస్తాడు. రవి స్థితి బాగాలేదు కనుక ఎముకలకు సంబంధించినటువంటి వ్యాధి బయటపడవచ్చు. అలాగే జ్ఞాపక శక్తికి చిన్న ఆటంకం ఏర్పడి మిమ్మల్ని ఇబ్బందులకు గురిచేస్తాయి. విలువైన వస్తువుని పోగొట్టుకుంటారు జాగ్రత్త వహించండి. అశ్విని నక్షత్ర జాతకులకు విపత్తారయింది కొంచెం ఆర్ధతకంగా జాగ్రత్త వహించండి. భరణీ నక్షత్ర జాతకులకు సంపత్తార కాబట్టి ఫలితాలు శుభప్రదంగా ఉంటాయి. కృత్తిక ఒకటో పాదం వారికి జన్మ తారైంది ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోండి.

పరిహారం :- శుక్రవారం నియమాన్ని పాటించండి. శుక్ర గ్రహానికి జపం చేయించండి. ఆదిత్యుని దర్శించండి లేదా ఆదిత్య హృదయం పారాయణ చేయండి.

వృషభరాశి :- ఈ రాశివారికి ఆకస్మిక ధనలాభము స్వర్ణాభరణ ప్రాప్తి శరీర సౌఖ్యం ఇవి సంప్రాప్తం కానున్నాయి. స్థానచలనం సూచిస్తుంది పెద్దలను సంప్రదించి జాగ్రత్త వహించండి. మీ పనులలో ఆటంకాలు ఎదురవకుండా ముందుగానే కొన్ని చర్యలను చేపట్టండి. కుటుంబంతో సంతోషంగా గడిపే సమయమూ కీర్తి ప్రతిష్టలు సంపాదించుకునే అవకాశం ఎక్కువగా ఉంది. మీ మాట తీరు మార్చుకోకపోతే ఇబ్బందులను ఎదుర్కోక తప్పదు. ఎంత చేసినా మిమ్మల్ని అభినందించే వారు తక్కువగా ఉంటారు. శరీర సౌఖ్యం ఉంది గనుక హాయిగా ఆనందంగా కుటుంబంతోనే బంధుమిత్రులు తోనే ఉండడానికి ప్రయత్నం చేయండి. ఈవారంలో అకారణ కలహము చోరబాధ ఉన్నాయి మీ తెలివి తేటలను ఇతరులు వినియోగించుకునే అవకాశాలెక్కువగా ఉన్నాయి. మీకు రహస్య స్థానాల్లో వ్యాధి బయటపడే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. కృత్తికా రెండు మూడు నాలుగు పాదాల వారికి జన్మ తయారైంది ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి రోహిణి నక్షత్ర జాతకులకు పరమమిత్రతార అయ్యింది పనులన్నీ మీకు నెరవేరబోతున్నాయి ముగిసిన ఒకటి రెండు పాదాలు వారికి మిత్ర సారింది చాలా అనుకూలత వుంది అనుకున్న పనులన్నీ నెరవేరతాయి

పరిహారం :- రాహు కేతువులకు పూజ చేయించండి మంచి ఫలితాలని పొందగలుగుతారు అలాగే నిత్యమూ దైవ దర్శనం చాలా ఉపయుక్తంగా మారుతుంది.

మిథున రాశి :- ఈ రాశివారు ఎన్నడూ లేనంత శారీరక మానసిక కుటుంబపరమైనటువంటి ఇబ్బందుల్ని ఎదుర్కోబోతున్నారు. ఎందులో చెయ్యి పెట్టిన మీకు హాని నష్టం తప్ప లాభం కనిపించట్లేదు. ఆర్థికంగా కూడా చాలా అంటే చెప్పలేనంత నష్టం వాటిల్లే అవకాశం ఉంది. ఎక్కడ పనులు అక్కడ ఆగిపోయి మీకు నిరుత్సాహాన్ని కలగజేస్తాయి. ఒకానొక సమయంలో మీ ఉద్యోగ వ్యాపారాదులకు భంగం ఏర్పడి ఎందుకు రా ఈ బ్రతుకు అనేంత కుమిలి పోయే స్థితికి వరకు తీసుకుని వెళిపోతుంది. చేతి వరకు వచ్చిన సంపద చేజేతులా పోగొట్టుకోవడం భోజనానికి కూడా సమయం దాటిపోవడం దక్కకపోవడం జరుగుతుంది. మీ కుటుంబంలోని మీకు వ్యతిరేకత తల్లిదండ్రులు అన్నదమ్ములు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం నిరుత్సాహము ఎక్కువగా ఉంది. శత్రువులకు ఇదే సమయంలో మిమ్మల్ని ఆటంకాలు గురిచేస్తారు. మృగశిర నక్షత్రం మూడు నాలుగు పాదాల వారికి మిత్ర తారైంది చాలా శుభ ఫలితాలు పొందుతున్నారు. ఆరుద్ర నక్షత్ర జాతకులకు నైధన తారైంది కాబట్టి పూర్తి వ్యతిరేకత ఫలితాలున్నాయి. చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సివస్తుంది. పునర్వసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు వారికి సాదన తారైంది పనులన్నీ సక్రమంగా సాగిపోతాయి ఏ ఆటంకాలు రావు.

పరిహారం :- శని గురులకు జపాలు చేయించండి వీలైతే నవగ్రహ జపాలు చేయించుకోవడం మీకు చాలా అవసరం. ఎంత వీలైతే అంత బంగారం వెండి దానం చేయండి .

కర్కాటక రాశి :- ఈ రాశి వారికి ఈ వారంలో ధనలాభం చాలా ఎక్కువగా ఉండి సుఖ జీవనము ఉన్నప్పటికీ మీలో కార్యదక్షత కొద్దిగా తగ్గడం వల్ల గొప్పదైన మానసిక ఆందోళనకి గురవుతారు. మీరు సహాయం చేసిన వ్యక్తులు మీకు సకాలంలో సహకరించలేని పరిస్థితి ఉంటుంది. అనారోగ్య సూచన ఉంది. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త వహించండి. పెద్దపెద్ద కార్యక్రమాల్లో అన్వయించే టప్పుడు అత్యంత సన్నిహితులు యొక్క సహకారాన్ని మాత్రమే పొందండి. మీ అనుభవ పాఠం మీకు కొత్త మార్గాన్ని విశేష సంపదల్ని చేకూరుస్తుంది. ఖర్చులు కూడా అలాగే ఉంటాయి . కానీ విందులు వినోదాలతో కొంత మానసిక ఆనందాన్ని పొందుతారు. దూర ప్రయాణాల అవకాశాలు కూడా ఉన్నాయి వాటిలో మీకు ఒక చక్కని మార్గదర్శక చేసే వ్యక్తుల పరిచయాలు కూడా ఏర్పడతాయి. పునర్వసు నక్షత్రం నాలుగవ పాదం వారికి సాధన తార అయ్యింది ఫలితాలు చాలా బాగున్నాయి. పుష్యమీ నక్షత్ర జాతకులకు ప్రత్యక్ తార అయ్యింది చాలా వ్యతిరిక్త ఫలితాలే ఉన్నాయి. ఆశ్రేష నక్షత్ర జాతకులకు క్షేమ తార అయ్యింది మంచి ఫలితాలు పొందనున్నారు.

పరిహారం :- శని గురుల స్థితులు మీకు వ్యతిరిక్తంగా ఉన్నాయి కాబట్టి ఆ రెండింటికి జపాలు చేయించండి. దక్షిణామూర్తి స్తోత్రం చదవండి మంచి ఫలితాలు ఉంటాయి.

సింహ రాశి :- ఈ రాశివారికి మళ్లీ సుఖప్రదమైన రోజులు విశేషంగా పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి . మీ ఆలోచనలన్నీ కూడా కార్యరూపంలోకి వచ్చి మంచి భవిష్యత్ ప్రణాళికలు ఏర్పడిపోతున్నాయి. విశేష ధనాన్ని కీర్తినీ గౌరవ మర్యాదల్ని పొందగలుగుతారు. కుటుంబంతో ఆనందాన్ని అనుభూతి చెందే అవకాశం ఎక్కువగా ఉంది. మీ కరార్య దక్షత మిమ్మల్ని మరింత ముందుకు నడిపిస్తుంది. శని ప్రభావం మీపై విశేషంగా పనిచేసి ధనాన్ని రహస్యంగా సంపాదించుకునే అవకాశాన్ని కల్పిస్తుంది. గురుని స్థితి సంపాదనకు కావల్సినటువంటి కుటుంబాన్ని కావల్సినటువంటి మంచి మార్గాన్ని మంచి ఆలోచనల్ని కలుగచేస్తాడు. సప్తమ కుజుడు మీకు కార్యాలకు ఆటంకాల్ని కలుగచేస్తాడు. చతుర్ధ చంద్రుడు రోగాన్ని సూచిస్తున్నాడు. ఈ రెండింటిని మీరు జాగ్రత్తగా గమనిస్తే తిరుగులేని ఫలితాలు పొందగలుగుతారు. మఖా నక్షత్రం జాతకులకు విపత్తార కాబట్టి పూర్తి వ్యతిరేక ఫలితాలున్నాయి. పుబ్బ నక్షత్ర జాతకులకు సంపత్తార అయింది మంచి లాభాన్ని పొందుతారు. ఉత్తర ఒకటో పాదం వారికి మాత్రం జన్మ తారైంది అనారోగ్య సూచనలు ఉన్నాయి.

పరిహారం :- మీరు వెండి చంద్రబింబము పెరుగులో వేసి దానం చేస్తే మంచి ఫలితాలు కనిపిస్తాయి. అలాగే మంగళవారం నాడు సుబ్రమణ్యేశ్వరస్వామి పూజ, ఆంజనేయస్వామి దర్శనం మీకు మంచి ఫలితాలని ఇస్తాయి.

కన్యా రాశి :- ఈ రాశివారికి శుభఫలితాలు విశేష ధనప్రాప్తి సంతోషము స్థిరాస్తి వ్యవహారాలు చాలా బాగున్నాయి. కష్టాలు ఉన్నప్పటికీ మానసికంగా శారీరకంగా ఆర్థికంగా ఆనందాన్ని పొందే సమయంలా మారుతుంది. నీకు కుటుంబంతో పిల్లలతో ఆనందాన్ని పొందే అవకాశం ఉంది. అయితే చిన్న అనారోగ్య సూచన మాత్రం పిల్లల కున్నది జాగ్రత్త వహించండి. విశేష ధన ప్రాప్తిని మీరు పొందబోతున్నారు. గురుడు మీకు సంపద లాభాన్ని కలిగిస్తున్నాడు. అలాగే బుద్ధుడు మానసిక ఆనందాన్ని ఎక్కువగా కలిగిస్తాడు. ఒక అనారోగ్య సూచనే దృష్టిలో పెట్టుకుంటే మీకీ వారం చాలా బాగా ఉంటుంది. అయితే అవమానాలు మాత్రం తగ్గే అవకాశాలు లేవు జాగ్రత్తగా వ్యవహార దక్షతతో ఉండండి . మీరుకొద్దిగా తగ్గినట్టుగా మీరు భావిస్తారు ఆత్మ న్యూనత దానివల్ల మరికొంచం ఇబ్బందులు కలిగే అవకాశం వుంది కానీ మీరు దృఢత్వాన్ని కలిగుంటే మీరు సాధించిన పనులు లేవు. ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు వారికి జన్మ తారైంది కాబట్టి ఫలితాలు అనారోగ్యాన్ని సూచిస్తున్నాయి. హస్త వారికి పరమ మిత్ర తారైంది కాబట్టి శుభ పరంపర కొనసాగుతుంది చిత్త ఒకట్రెండు పాదాలు వారికి మిత్ర తార అయింది ఫలితాలు బాగున్నాయి.

పరిహారం :- శనికి తప్పకుండా జపం చేయించండి. నువ్వులు నల్లని వస్త్రం బ్రాహ్మణునకు దానం చేయండి రాహు కేతువులకి మినుములు ఉలువలు దానం చేయించండి.

తులా రాశి :- ఈ రాశి వారికి ఈ వారం కొంచెం ఇబ్బందికరంగా నడుస్తోంది . వ్యతిరేక ఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అల్సర్ ఇలాంటి వ్యాధులున్న వాళ్లు తొందరగా వైద్యుని సంప్రదించడం చాలా అవసరం. చెప్పాలంటే తిన్నది అరక్క కొందరికి తిండికి లేక కొందరికి ఈ వారంలో చాలా ఇబ్బందుల్ని ఎదుర్కునే అవకాశం ఉంది. ఖర్చు ఎక్కువ అవడమే కాదు అనవసరంగా నష్టపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. శత్రువులు మిమ్మల్ని ఇబ్బంది పెడతారు. మీ ధనం ఇతరుల చేతులు ఉండిపోయింది. రావలసిని కూడా మీకు అందవు. అంతేకాదు శత్రువులు ఒత్తిడి మీపైన ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఒక్కటి మీ కళ్ల ముందే మీ చేజేతులా పోగొట్టుకున్నట్టుగా మీలో అధైర్యాన్ని నింపేస్తుంది. మీకు చంద్రుడు కొంత అనుకూలించడం వల్ల సుఖ సౌఖ్యం అనుకూలత వల్ల పనులు వారాంతంలో మాత్రము నెరవేరుతాయి. చిత్త మూడు నాలుగు పాదాలు వారికి మిత్ర తారైంది శుభ ఫలితాలు చాలా బాగున్నాయి. స్వాతి నక్షత్ర జాతకులకు నైధన తారైంది ప్రతి పనికి ఆటంకమే సూచిస్తుంది. విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు వారి కి సాధన తారైంది బలం కొనసాగుతోంది.

పరిహారం :- శనికి నువ్వులు నల్లని వస్త్రం దానం చేయించండి. ఇది చాలా అవసరం అలాగే మినుగులు దానం చేయించండి. సూర్యోదయం సరికి లేచి సూర్య దర్శనం చేయండి మీ ఆరోగ్యం కుదుటపడుతుంది.

వృశ్చిక రాశి :- ఈరాశి వారికి శుభాశుభాలు సమఫలాన్ని ఇవ్వబోతున్నాయి. మీ మాట తీరు వల్ల కొంచెం ఇబ్బందికి గురిచేస్తోంది. అనుకోని ఖర్చులు మీ ఆగ్రహానికి కారణం ఔతున్నాయి. అలాగే శత్రువులు ఒత్తిడి కూడా మీపైన ఎక్కువగా ఉంది . మానసిక ఆందోళన ఎక్కువ పడుతూ ఉంటారు. మీరు బయటికి గాంభీర్యంగా ఉన్నా మీ మానసిక ఆందోళనలో మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. ఒక శుభప్రదమైన వార్తను వినడంతో మీరు ఆనందాన్ని కుటుంబంతో పంచుకుంటారు. ధనలాభం ఎంతుందో వ్యయం కూడా అదే స్థాయిలో ఉంది. నూతన ఉద్యోగ వ్యాపారాదులు మీకు కొద్దిపాటి ఉత్సాహాన్ని కలుగజేసి ఆర్థిక లాభాన్ని కూడా కలగచేస్తాయి. పిల్లల ద్వారా ఆనంద ప్రదమైన వార్తలు విని వారితో సంతోషాన్ని పంచుకుంటారు. స్తిరాస్తి వ్యవహారాల్లో ఆచితూచి అడుగు వేయాలి . వీలుంటే ఏమైనా పరిష్కారం చేసుకోవడం చాలా మంచిది. భోజన సౌకర్యం ఈవారంలో మీకు తక్కువగా ఉంది. ఇంటి నుండి దూరంగా వెళ్ళే అవకాశం కనిపిస్తోంది. విశాఖ నాలుగో పాదం వారికి సాధన తారైంది ఫలితాలు చక్కగా ఉన్నాయి . అనురాధ నక్షత్ర జాతకులకు ప్రత్యక్ తారైంది కాబట్టి ఫలితాలు చాలా వ్యతిరేకంగా ఉంటాయి. జ్యేష్ఠా నక్షత్ర జాతకులకు క్షేమ తారైంది చాలా పనులలో మీరు ముందుడుగు వేసి నడిపించు కోగలుగుతారు.

పరిహారం :- అదిత్యహృదయం పారాయణ చేయండి ఆరోగ్యం బావుంటుంది. యోగా చేయండి అలాగే శుక్రునికి ప్రీతిపాత్రంగా బబ్బుర్లు దానం చేయండి.

ధనురాశి :- ఈ రాశివారికి శుభ పరంపర పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా అంతర్గత శత్రువులు బాహ్య శత్రువులు నాశనం అవుతారు. సకల భోగాలు ఈ వారంలో ఒక్కసారికి మీరు పొందబోతున్నారు. అయితే చిన్న అపకీర్తి దోషం ఉంది దాన్ని మా అధిగమించడానికి ప్రయత్నం చేయాలి. మీలో ఉన్న గొప్ప విశేషం ఏంటంటే శత్రువులు ఎంత వృద్ది చెందుతుంటారో వారిని అంత లౌక్యంగా మాటలతో అనుకూలంగా చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఈ వారంలో కనిపిస్తున్నాయి. ఏ పని తలంచిన సరే చక్కగా నెరవేరేటట్లు ముందు ఆర్థికంగానూ సామాజిక పరంగాను కూడా లాభాలు పొందగలుగుతారు. ఇంటా బయట కూడా సుఖ సౌఖ్యాలు మీకు లభించబోతున్నాయి. శని గురుల ప్రభావం మీపైన ఎక్కువగా ఉంది గురు డైతే లాభిస్తున్నాడు. శని హాని చేస్తాడు కాబట్టి శని ప్రభావం చేత వాహన ప్రయాణం వల్ల ఇబ్బంది ఏర్పడబోతోంది. దాన్ని అధిగమించడానికి ముందు జాగ్రత్త చర్యగా మీరు సోమవారం శివ సందర్శనం చేసుకోవాలి. ఏ చిన్న అవకాశం వచ్చినా దేన్ని కూడా వదలకుండా మీరు హస్తగతం చేసుకుని మీ తాలూకా నైజం తో ముందుకు వెళ్ళినట్లయితే మంచి ఫలితాలు తొందరగా పొందగలుగుతారు. మూలా నక్షత్ర జాతకులకు విపత్ తారైంది ప్రతికూల ఫలితాల ఎక్కువగా ఉన్నాయి. పూర్వాషాఢ నక్షత్ర జాతకులకు సంపత్తారైంది కాబట్టి మంచి ఫలితాల్ని వీరు పొందబోతున్నారు. ఉత్తరాషాఢ ఒకటో పాదం వారికి జన్మ తారైంది అనారోగ్య సూచన మాత్రం ఉంది జాగ్రత్త వహించండి.

పరిహారం :- శనిదోష నివృత్తి కోసం నువ్వులు నల్ల వస్త్రము దానం చేయండి. గోవు ( ఆవు ) వెనుకభాగాన్ని దర్శించి నమస్కారం చేయండి. చక్కని ఫలితాలు పొందగలుగుతారు.

మకర రాశి :- వీరికి శుభ పరిణామాలు కొద్దిగా ఉన్నాయి. మీకు ఆత్మస్థైర్యం కావాలి. ధైర్యే సాహసే లక్ష్మి అన్నట్టుగా మీరు కొన్ని సూచనలను ముందుగా అందుకుని చొచ్చుకుని పోతేనే మీకు ప్రయోజనాలుంటాయి లేకపోతే మాత్రం కొద్ది ఇబ్బందుల్ని ఎదుర్కొంటారు. రవి శని రాహు కేతువులు పూర్తి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. కాబట్టి ధైర్యం ఉంటే గానీ ముందుకు వెళ్లలేరు. గురుడు కూడా కొంత అశాంతాన్ని ఇస్తున్నాడు కాబట్టిస్థిరమైన ఆలోచనలు కలిగి వుండాలి. బంధుమిత్రుల్ని కలుపుకుంటూ వెళ్లిపోవాలి. ఒక విపత్తు మిమ్మల్ని తన వైపు లాగుతోంది. అది శని తాలుకా ప్రభావమే కాబట్టి దాన్ని అధిగమించి డానికి ముందుగానే చర్యలు తీసుకోండి. దైవస్మరణ ని ఎట్టి పరిస్థితిలోనూ విడిచిపెట్టకండి. సంఘపరంగా గౌరవ మర్యాదలు అలంకారాలు మీకు లభ్యం కానున్నాయి. ఎంత మంచి జరగబోతోందో కుజుని తాలూకా ప్రభావం చేత అది వెనక్కి లాగభడుతుంది. ఇతరుల విషయాల లో జోక్యం చేసుకోకుండా మీరున్నట్లయితే చాలా అభివృద్ధిని సాధించగలుగుతారు. ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాల వారికి జన్మ తారైంది ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి. శ్రవణం వారికి పరమ మిత్ర తారైంది గౌరవాదులకు చక్కగా బావుంది. ధనిష్ఠ ఒకటి రెండు పాదాల వారికి మిత్ర తారైంది కాబట్టి శుభ ఫలితాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్అయి.

పరిహారం :- శనికి వీలైనంత శనివారం నాడు ఆరు నుంచి ఎనిమిది గంటల వరకు కూర్చుని జపం చేయండి. ఎట్టి పరిస్థితిలో మరిచిపోకండి. ఇది ప్రతివారం మీరు చేసినా భవిష్యత్తులో చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

కుంభ రాశి : ఈ రాశివారికి మొత్తం ప్రపంచంలో ఉన్న కష్టాలన్నీ వేళ్ల మీద ఉన్నట్టుగా అనుకరిస్తుంది మిధునము కుంభము సుమారుగా ఒకేలా ఉన్నాయని చెప్పొచ్చు . ఎటు చూసినా అన్ని ఇబ్బందులే కనిపిస్తే అన్నీ ఉంటాయి అనుభవించే యోగం ఉండదు అందరూ తెలుసు కానీ ఎవ్వరూ మనకి సమయానికి మాట సహాయం కూడా చేయలేనటువంటి పరిస్థితి వాడ అండానికి మే మన అంగీకరించదు ఎందుకంటే ఒకప్పుడు మీ ద్వారా వాడ ద్వారా పరస్పరం ఒకరికొకరు సాహస అంది ఉన్నటువంటి సమయాలు ఒక పెద్ద విచారణ మిమ్మల్ని కట్టిపడేస్తుంది దాంతో మరింత వెనకడుగు వేస్తారు మనోధైర్యం ఆత్మస్థైర్యం కోల్పోకుండా ఉండడమే ఈ సమయంలో చాలా ఉపయుక్తం. స్త్రీ సౌఖ్యం ఉంది అన్నంత మాత్రాన ఆమెను పెద్దగా చేసుకుని మంత్రాలోచన మాత్రం చేయవద్దు. అదే వ్యక్తిని చూపించి ఇతరులు మీకు ఇబ్బంది కలిగించే స్థితి కూడా ఉంది. ధనవ్యయం అగౌరవం రాజ దండన విచారం ఇలాంటివి మీకు పడనివి మీకు అక్కర్లేనివి మిమ్మల్ని చుట్టుముట్టి ఇబ్బందిపెడతాయి. ఇది చాలా గడ్డుకాలం. కొన్ని వారాల పాతు చాలా జాగ్రత్తగా ఉండండి. ధనిష్ఠ మూడు నాలుగు పాదాలు వారికి మిత్ర తారైంది చాలా శుభపరిణామాలు ఉన్నాయి. శతభిషం వారికి నైధన తారైంది కాబట్టి చాలా వ్యతి రిక్త ఫలితాలు ఉన్నాయి పూర్వాభాద్ర ఒకటి రెండు మూడు పాదాలు వారికి సాధన పారింది కాబట్టి ప్రాణాన్ని సక్రమంగా జరుగుతాయి.

పరిహారం :- కుజ శనుల ప్రభావాలు మీమీద ఎక్కువగా పనిచేస్తున్నాయి కాబట్టి కుజుడికి సుబ్రహ్మణ్య ఆవరణార్చన చేయించండి. శనికి జప దాన హోమాదులు కూడా జరిపించండి.

మీన రాశి :- ఈరాశి వారికి సంపదలు అనుకోకుండా చేతికి అంది పోతాయి. ధనము అనూహ్యంగా చేతికొచ్చేస్తుంది అయితే అంతా ధనము ఖర్చు జరిగిపోతుంది. కానీ మంచివారు మీ చుట్టూ పదిమంది చేరే అవకాశం ఉంది. శత్రువుల మీద మీరు విజయాన్ని సాధిస్తారు. ఇంటా బయటా కూడా మీకు శుభపరిణామాలు ఎక్కువగా ఉన్నాయి. కొంచెం ఆచి తూచి అడుగు వేస్తుండటం మాత్రం అవసరం. ఎందుకంటే కుజ బుధ గురు స్థితి బాగున్నప్పటికీ రాహు కేతు స్థితి వారం మధ్యలో చంద్ర స్థితి బాగాలేదు కాబట్టి చిన్న ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉంది. అందుకని ముందు జాగ్రత్త చర్యగా సన్మిత్రుణ్ణి మీ దగ్గర ఉంచుకుని పెద్దవాళ్లతో సంప్రదించి కార్యాల్ని నెరవేర్చుకోవడం చాలా ఉత్తమమైనటువంటి ఆలోచన. రాజకీయ విషయాల్లో మాత్రం జోక్యం చేసుకోవద్దు. ఇది హెచ్చరిక గానే భావించండి. పూర్వాభాద్ర నాలుగో పాదం వారికి సాధన తారైంది కార్యాలన్నీ నెరవేరుతాయి. పూర్వాభాద్ర వారికి ప్రత్యక్ తారైంది కాబట్టి ప్రతికూల పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి. రేవతి వారికి క్షేమ తారైంది అన్ని పనులు చక్కగా నెరవేరి హాయిగా ఆనందంగా ఉండగలుగుతారు.

పరిహారం :- రాహుకేతు పూజ చేయించండి చంద్రునికి బియ్యము తెల్లని వస్త్రం వీలైతే దధి చంద్ర దానము చేయండి.

Next Story