'‌బిగ్‌బాస్' బ్యూటీ పునర్నవి ఎంగేజ్‌మెంట్‌..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  29 Oct 2020 11:32 AM IST
‌బిగ్‌బాస్ బ్యూటీ పునర్నవి ఎంగేజ్‌మెంట్‌..!

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్ 3 కంటెస్టెంట్, హీరోయిన్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కనుంది. బుధవారం రాత్రి ఆమె పెట్టిన పోస్టు అభిమానులను షాక్‌కు గురి చేసింది. పునర్నవి లేటెస్టుగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఫోటో షేర్ చేస్తూ ''ఫైనల్లీ! ఇట్స్ హ్యాపెనింగ్'' అని పోస్ట్ పెట్టింది. ఈ ఫొటోలో పునర్నవి భూపాలం చేతిని పట్టుకొని ఎదురుగా మరో వ్యక్తి కనిపిస్తున్నారు. అందులోనూ పునర్నవి ఫింగర్ కి రింగ్ కూడా కనిపిస్తోంది. ఆ చేయి ఎవరిదనేది మాత్రం పునర్నవి చెప్పలేదు. ఈ నేపథ్యంలో పునర్నవి నటించే కొత్త వెబ్ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా ఈ పోస్ట్ పెట్టిందా అని కొందరు నెటిజన్స్ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఓ మై గాడ్.. నువ్వు నిజమే చెబుతున్నావా..? ఎట్టకేలకు సీక్రెట్ బయటపెట్టావు.. ఇంకొంచెం ఎక్కువ చెప్పు అని ఓ నెటీజన్ కామెంట్ పెట్టగా.. అక్టోబర్ 30 వరకు వేచి ఉండు అని పునర్నవి సమాధానం ఇచ్చింది.

పునర్నవి 'ఉయ్యాలా జంపాలా' 'మళ్లీ మళ్లీ ఇది రాని రోజు' చిత్రాలలో కీలక పాత్రలలో నటించింది. 'పిట్టగోడ' సినిమాతో హీరోయిన్ గా మారిన పునర్నవి.. 'బిగ్ బాస్' తెలుగు సీజన్ - 3 తో మంచి క్రేజ్ తెచ్చుకుంది. ముక్కుసూటిగా మాట్లాడుతూ ప్రేక్షకులను ఆకర్షిస్తూనే పొట్టి పొట్టి డ్రెస్సులు ధరించి బిగ్ బాస్ హౌజ్ ని హీటెక్కించింది. ఇదే క్రమంలో సింగర్ రాహుల్ సింప్లిగంజ్ - పునర్నవి మధ్య ఎఫైర్ నడుస్తోందంటూ నిత్యం వార్తల్లో నిలిచింది. కానీ ఇద్దరూ అలాంటిదేమీ లేదని.. తాము స్నేహితులమని చెబుతూ వచ్చారు.

View this post on Instagram

Finally! It's happening 🥰❤️

A post shared by Punarnavi Bhupalam🧿 (@punarnavib) on

Next Story