బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ ఖాన్ మరోసారి తల్లి కాబోతున్న విషయం తెల్సిందే. తాను రెండో బిడ్డకు జన్మనివ్వబోతున్నానని ఆగస్టులో ఆమె సోష‌ల్ మీడియా ద్వారా అభిమానుల‌కు తెలిపింది. సైఫ్ అలీ ఖాన్.. కరీనా దంప‌తుల‌కు ఇప్పటికే తైమూర్ అనే కొడుకును ఉన్నాడు. తైమూర్ గురించి రెగ్యులర్ గా సోషల్ మీడియాలో వెబ్ మీడియాలో ఏదో ఒక వార్త చక్కర్లు కొడుతూనే ఉంటుంది.

ఇదిలా ఉంటే.. సాధారణంగా కొందరు హీరోయిన్లు తమ గర్భాన్ని చూపించుకోడానికి యిష్టపడరు. పైగా ఇది కరోనా సీజన్ కావడంతో బయటకు రావడానికి మరింత భయపడతారు. కరీనా కపూర్ మాత్రం ఇటువంటివి పట్టించుకోకుండా షూటింగ్‌లో పాల్గొంది. అంతేగాక, ఇందుకు సంబంధించిన వీడియోను ఇన్‌స్ట్రాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఓ యాడ్ ఫిల్మ్ షూటింగ్ లో తాజాగా ఆమె పాల్గొన్నట్లు సమాచారం. ఆ సమయంలో ఆమె అక్క కరిష్మా కపూర్ కూడా ఆమె వెంటే ఉంది. కుర్చీలో కూర్చొని ఆమె హుషారుగా ఫొటోకు ఫోజులిచ్చింది క‌రీనా. ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

View this post on Instagram

wooohoooo Something exciting comin uppp 😉❤️ #sistersquad 👭 #behindthescenes

A post shared by Kareena Kapoor Khan (@therealkareenakapoor) on Oct 27, 2020 at 12:41am PDT

సుభాష్

.

Next Story