మ‌రో కీల‌క ప్ర‌యోగానికి సిద్ద‌మైన ఇస్రో..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  25 Nov 2019 11:03 AM IST
మ‌రో కీల‌క ప్ర‌యోగానికి సిద్ద‌మైన ఇస్రో..!

నెల్లూరు : చంద్రయాన్‌-2తో అంతరిక్ష పరిశోధనలో కీలక మైలురాయిని అధిగమించిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) తాజాగా మరో కీలక ప్రయోగానికి సిద్ధమైంది. భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన సతీశ్​ ధవన్​ స్పేస్​ సెంటర్​ షార్​లో పీఎస్ఎల్‌వీ-సీ47 ప్రయోగానికి సిద్ధమైంది. ప్రయోగానికి ముందు నిర్వహించే పరీక్షలు, తనిఖీలను శని, ఆదివారాల్లో శాస్త్రవేత్తలు నిర్వహించారు. నేడు ప్రయోగానికి రిహార్సల్​ చేయనున్నారు. ఇది ముగిసిన అనంతరం మంగళవారం ఉదయం 5.28 గంటల నుండి ప్రీ కౌంట్​డౌన్​ ప్రారంభం కానుంది. అనంత‌రం రాకెట్​ సన్నద్ధత, ల్యాబ్​ సమావేశాలు జరగనున్నాయి.

Next Story