విషాదంలో సినీ ఇండ‌స్ట్రీ.. నిర్మాత మృతి

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  2 Oct 2020 7:39 AM IST
విషాదంలో సినీ ఇండ‌స్ట్రీ.. నిర్మాత మృతి

త‌మిళ‌ సినీ ఇండ‌స్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. సింగ‌ర్ బాల‌సుబ్ర‌మ‌ణ్యంను కోల్పోయి వారం రోజులు కూడా గ‌డ‌వ‌క‌ముందే.. కోలీవుడ్ మ‌రో ప్ర‌ముఖుణ్ని కోల్పోయింది. నిర్మాత కృష్ణకాంత్(52) బుధవారం సాయంత్రం గుండెపోటుతో కన్నుమూశారు. లక్ష్మీ మూవీ మేకర్స్‌ సంస్థలో మేనేజర్‌గా పని చేసిన కృష్ణకాంత్‌ తర్వాత తిరుడా తిరిడి చిత్రం ద్వారా నిర్మాతగా మారారు.

అనంత‌రం శింబు నటించిన మన్మథుడు, కింగ్, పుదుకోట్టైలిరిందు శరవణన్, చొల్లి అడిప్పేన్, మచ్చి చిత్రాలను నిర్మించారు. ఈయన బుధవారం గుండెపోటుకు గురవడంతో కుటుంబసభ్యులు చెన్నైలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి త‌ర‌లించారు. అప్పటికే ఆయ‌న మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు.

కృష్ణకాంత్‌కు భార్య, ఇద్దరు కొడుకులు ఉన్నారు. కృష్ణకాంత్‌ మృతి ప‌ట్ల ప‌లువురు సినీ ప్ర‌ముఖులు సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఇదిలావుంటే.. కృష్ణకాంత్ నిర్మించిన తిరుడా తిరిడి‌ చిత్రం తెలుగులో దొంగ ‌దొంగ‌ది పేరుతో తెలుగులో రీమేక్ చేశారు. ఇందులో మంచు మ‌నోజ్‌, స‌దా హీరో, హీరోయిన్లుగా న‌టించారు.

Next Story