ప్రముఖ గాంధర్వ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మృతి చెందడం సినీ ఇండస్ట్రీతోపాటు అభిమానులు, ప్రజలు తీవ్ర దిగ్ర్భాంతికి గురయ్యారు. దాదాపు 40 రోజుల పాటు చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆ రోజు మృతి చెందారు. రోజురోజుకు ఆయన ఆరోగ్యం విషమించి చివరికి అందరికి దూరంగా వెళ్లిపోవడం ప్రతి ఒక్కరిని కలచివేస్తోంది. ఆయన క్షేమంగా తిరిగి రావాలని ఎంతో మంది పూజలు చేశారు. గత పది రోజులుగా కోలుకుంటున్నారన్న వార్తలు విన్న ప్రముఖులు అభిమానులు పూజలు ఫలించాయనుకున్నంతలోపే తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. ఆయన లోటు తీరనిదని, ఆయన మన మధ్య లేకపోయినా.. పాడిన పాటలు ఎల్లప్పుడు గుర్తిండిపోతాయని, ఆయన లేని లోటు తీరనిదని ప్రముఖులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆయన మరణం పట్ల బాలు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు.

కళ ప్రపంచం గొప్ప వ్యక్తిని కోల్పోయింది: ప్రధాని మోదీ

ప్రముఖ గాయకుడు హఠాన్మరణం చెందడం చాలా బాధకరమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. మన కళ ప్రపంచం ఒక గొప్పవ్యక్తిని కోల్పోయింది. ఆయన ఎన్నో పాటలు పాడి మంచి పేరును సంపాదించుకున్నారు. ఇలాంటి వ్యక్తి ఇక లేరని తెలిసి చాలా బాధాకరం. ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను అని మోదీ అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా.

బాలు మన మధ్య లేకపోవడం బాధాకరం: అమిత్‌ షా

పద్మభూషణ్‌ అవార్డు గ్రహిత ఇక లేరని తెలిసి తీవ్ర ఆవేదన గురయ్యాననిగురయ్యానని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఆయన పాడిన పాటలు మన హృదయాల్లో ఎప్పటికి నిలిచిపోతాయి. ఆయన కుటుంబ సభ్యులకు నాప్రగాఢ సానుభూతి. ఆయన లోటు తీరనిది. వేలాదిగా పాటలు పాడి ఎంతో మంది అభిమానాన్ని సంపాదించుకున్న బాలు.. మన మధ్య లేకపోవడం విచారకరం అని అన్నారు.

సినీ లోకానికి ఎనలేని సేవలు చేశారు: కేసీఆర్‌

ప్రముఖ సినీ గాయకుడు మరణ వార్త విని తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌. ఎన్నో మధురమైన పాటలు పాడి అందరిని అలరించిన బాలు ఇక లేరని తెలిసి దురదృష్టకరం. ఆయన లోటు తీరనిది. గాయకుడిగా, నటుడిగా, సంగీత దర్శకుడిగా సినీ లోకానికి ఎనలేని సేవలు అందించిన గొప్ప వ్యక్తి బాలు అని కొనియాడారు.

గొప్పగాయకున్ని కోల్పోయాం: వైఎస్‌ జగన్‌

బాలసుబ్రహ్మణ్యం మృతి పట్ల ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణ వార్త విని షాక్‌కు గురయ్యానని అన్నారు. ఆయన లోటు తీరనిదని, బాలు పాడిన వేలాది పాటలు ప్రతి ఒక్కరిలో గుర్తిండిపోతాయని అన్నారు. బాలు మన మధ్య లేకపోయినా పాడిన పాటలు కళ్లముందే కదలాడుతుంటాయని అన్నారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.
antalya escort
anadolu yakası escort maltepe escort escort bayan kartal escort ataşehir escort pendik escort bostancı escort kurtköy escort maltepe escort kartal escort