ఎక్స్‌పెక్టేషన్స్ VS రియాలిటీ : ఇలా ఉంటుందంటున్న‌ ప్రియాంక

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  24 May 2020 8:03 AM GMT
ఎక్స్‌పెక్టేషన్స్ VS రియాలిటీ : ఇలా ఉంటుందంటున్న‌ ప్రియాంక

సోషల్ మీడియా ద్వారా ప్రియాంక చోప్రా తన అభిమానులను ఎప్పటికప్పుడు ఎంటర్టైన్ చేస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఆమె ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో ఫాలో అయ్యే వాళ్లకు చాలా విషయాలను తెలియజేస్తూ ఉంటుంది. తన భర్త నిక్ జోనాస్ విషయాల దగ్గర నుండి తాను ఏమేమి చేస్తున్నానో మొత్తం వివరిస్తూ ఉంటుంది. ప్రస్తుతం ప్రియాంక చోప్రా తన భర్తతో కలిసి లాస్ ఏంజెల్స్ లో ఉంటుంది.

తాజాగా తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో ప్రియాంక చోప్రా ఒక స్టన్నింగ్ ఫోటోను షేర్ చేసుకుంది. పింక్ కలర్ స్విమ్ సూట్ లో ప్రియాంక చోప్రా సేదతీరుతూ కనిపిస్తుంది. సన్ గ్లాసెస్ పెట్టుకుని.. సెల్ఫీ తీసుకుని కనిపించింది ప్రియాంక. ఫోటో సూపర్ అని అనుకునే లోపే.. మరో ఫోటోను కూడా తన అకౌంట్ లో పెట్టింది ప్రియాంక. ఈ సారి ఆ ఫోటోలో ముఖానికి తెల్లటి గుడ్డను పెట్టుకుని కనిపించింది. ఎండలో ముఖం కందిపోకుండా అలా చేసింది. అంచనాలకు.. నిజానికి చాలా తేడా ఉంటుందని.. "Expectation vs. Reality." అంటూ రెండు ఫోటోల మధ్య ఉన్న తేడా గురించి అందరికీ తెలిపింది ప్రియాంక. ప్రియాంక ఫోటో కింద పలువురు బాలీవుడ్, హాలీవుడ్ సెలెబ్రిటీలు నవ్వుల ఈమోజీలు పెట్టారు.

లాక్ డౌన్ కారణంగా లాస్ ఏంజెల్స్ కు పరిమితమైన ప్రియాంక చోప్రా ఎప్పటికప్పుడు తన ఫోటోలను అభిమానులతో పంచుకుంటూ ఉంది. ప్రియాంక చోప్రా 'ది వైట్ టైగర్' నెట్ఫ్లిక్స్ అడాప్టేషన్ లో నటిస్తోంది. రాజ్ కుమార్ రావ్ ఈ సినిమాలో ప్రియాంక చోప్రా సరసన నటిస్తూ ఉన్నాడు. వి క్యాన్ బి హీరోస్ అనే సూపర్ హీరో సినిమాలో కూడా నటిస్తోంది. అమెజాన్ వెబ్ సిరీస్ 'సిటడెల్' లో కూడా ప్రియాంక చోప్రా నటించబోతోంది. ప్రియాంక చివరి థియేటర్ రిలీజ్ 'ది స్కై ఈజ్ పింక్' ఈ సినిమాలో ఫర్హాన్ అక్తర్, జైరా వాసీమ్ లు నటించారు. సినిమా డిజాస్టర్ గా నిలిచింది.

Next Story