భారతదేశ ఆత్మను కాపాడినందుకు ఢిల్లీకి ధన్యవాదాలు..
By అంజి
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆప్ మరో సారి తన జోరు కొనసాగించింది. భారీ సంఖ్యలో అసెంబ్లీ స్థానాలకు ఆప్ కైవసం చేసుకుంది. ఈ సందర్భంగా 'భారతదేశ ఆత్మను కాపాడినందుకు ఢిల్లీ ప్రజలకు ధన్యవాదాలు' అంటూ ఎన్నికల వ్యూహాకర్త ప్రశాంత్ కిషోర్ ట్వీట్ చేశారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఆమ్ ఆద్మీ పార్టీ, కేజ్రీవాల్‌ను ఆయన నివాసంలో కలిసి పీకే శుభాకాంక్షలు తెలిపారు. ఆప్ పార్టీ విజయంలో పీకే కీలక పాత్ర పోషించారు.
అటూ ఆప్ మేనిఫేస్టోతో పాటు, పీకే వ్యూహాలు మరోసారి కెజ్రీవాల్ గెలుపుకు కీలకంగా పని చేశాయి. ఢిల్లీ కాషాయం జెండా ఎగరేయాలనుకున్న బీజేపీ ఆశలు ఆవిరిగానే మిగిలిపోయాయి. జాతీయ స్థాయి నేతలతో ఢిల్లీ ప్రచారం నిర్వహించిన ఆశించిన స్థాయిలో కూడా సీట్లు కరువయ్యాయి. ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో ప్రశాంత్ ఓ కొత్త ఒరవడిని తీసుకొచ్చారు. ఒకవైపు కేజ్రీవాల్ సంక్షేమ పథకాలు.. మరో వైపు ప్రశాంత్ ప్రచార వ్యూహాలే ఆప్ గెలుపులో కీలక పాత్ర పోషించాయి. మరోవైపు బీజేపీ స్థానిక సమస్యలపై ప్రచారం చేయకుండా.. కేవలం జాతీయ స్థాయి సమస్యలపైనే ప్రచారం చేసింది. దీంతో బీజేపీ వ్యూహాలకు సరైన రీతిలో పీకే చెక్ పెట్టారు.
దేశ రాజధాని ఢిల్లీ పీఠం అధిరోహించడానికి సర్వశక్తులు ఒడ్డినా బీజేపీకి.. మాస్టర్ మైండ్ ప్రశాంత్ కిషోర్ నుంచి పెద్ద ఎదురుదెబ్బె తగిలింది. మొన్న ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తన స్ట్రాటజీని వాడిన పీకే.. ఇప్పుడు ఢిల్లీలో అర్వింద్ కేజ్రీవాల్ విజయంతో తనకు తిరుగేలేదని నిరూపించుకున్నాడు. గత సంవత్సరం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఢిల్లీలోని అన్ని లోక్‌సభ స్థానాల్లో బీజేపీ గెల్చింది. దీంతో అప్పుడే ఆప్ ఓటమి ఖాయమని అందరూ ఫిక్సైపోయారు. అయితే అందరి అంచనాలను తలకిందులూ చేస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ విజయఢంకా మోగించింది. జాతీయవాద అంశాలపై ఆప్ ఎలాంటి వ్యాఖ్యలు చేయకుండా ప్రశాంత్ కిషోర్ వ్యహరించారు.
ఆప్ విజయం నేపథ్యంలో ఆ పార్టీ చీఫ్ కేజ్రీవాల్‌కు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. కేజీవాల్‌కు ఏపీ సీఎం వైఎస్ జగన్, వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, సమాజ్‌వాద్ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరిస్తున్న బీజేపీని ప్రజలు తిరస్కరించారని మమతా బెనర్జీ పేర్కొన్నారు.