ఇంతకీ ఎవరా గురూజీ ? పూనమ్ ఎందుకంతలా విరుచుకుపడింది ?
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 18 Jun 2020 5:30 PM ISTబాలీవుడు నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య తర్వాత.. నటి పూనమ్ కౌర్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి. గురూజీ అనే హ్యాష్ టాగ్ పెట్టి ఓ డైరెక్టర్ తనపట్ల కనీసం జాలి కూడా లేకుండా మాట్లాడాడంటూ వరుస ట్వీట్లతో విరుచుకు పడింది. పూనమ్ ట్వీట్లను చూసిన నెటిజన్లు గురూజీ అంటే ఆ డైరెక్టరే కదూ అంటూ ట్వీట్లు చేస్తున్నారు. ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరో మీక్కూడా ఓ ఐడియా వచ్చిందనుకుంట కదా..అతని గురించే పూనమ్ అంతలా ట్వీట్లు చేసింది. అతనివల్లే తనకు సినీ అవకాశాలు రాక చచ్చిపోవాలని కూడా అనుకుందట పూనమ్.
సినిమా అవకాశాలిప్పిస్తాడని ఆశపడి ఓ దర్శకుడితో రిలేషన్ మెయింటేన్ చేయగా.. అతను అవకాశాలిప్పించలేదు సరికదా..కనీసం మాట్లాడానికి ట్రై చేసినా తప్పించుకున్నాడంటూ పూనమ్ ట్వీట్ లో పేర్కొంది. ఓ రోజు తన స్నేహితుడే ఆ దర్శకుడిని కలిసి పూనమ్ పరిస్థితిని వివరించి, సహాయం చేయాలని కోరినా ఎలాంటి స్పందన లేకపోవడంతో ఆమే స్వయంగా ఆ డైరెక్టర్ ను కలిశానని రాసుకొచ్చింది.
నీతో మాట్లాడాలని అడుగగా..అతను కొంత సమయం తనతో మాట్లాడేందుకు ఒప్పుకున్నాడని చెప్పింది. నేను డిప్రెషన్ లో ఉన్నాను..నా డిప్రెషన్ ను కొంచమైనా తగ్గించగలవా అని అతడిని అడుగగా ఏమీ చెప్పలేదు. ఆ తర్వాత నాపై ఉన్నవీ, లేనివన్నీ పుట్టించి ఓ వెబ్ సైట్ లో తన గురించి చెడుగా ఆర్టికల్స్ రాయించాడని వాపోయింది పూనమ్. దాంతో తాను మరింత డిప్రెషన్ కు గురయ్యానని పేర్కొంది. ఆ తర్వాత డిప్రెషన్ తోనే చచ్చిపోవాలనుకున్న విషయం గురించి కూడా గురూజీకి చెప్పగా..నువ్వు ఫోన్ చేస్తే అర్థరాత్రైనా వస్తాను అనే స్టేజీ నుంచి నువ్వు చచ్చిపోతే ఏమీ జరగదు, మహా అయితే ఒకరోజు మీడియాలో వస్తావ్ అనే స్టేజీకొచ్చాడని తన ఆవేదనను వెళ్లగక్కింది.
U have done thing but manipulated your friends life for your benefit ... i don’t think anyone has benefitted out of his life like u did .... ur manipulative ...ur sick .... #guruji
— पूनम कौर ❤️ poonam kaur (@poonamkaurlal) June 17, 2020
గురూజీకున్న ఉన్నతమైన పరియాలతోనైనా తనకు కొన్ని అవకాశాలిప్పించాలని అడిగానే తప్ప..తన సమస్యలన్నింటినీ అతడిని పరిష్కరించమని కోరలేదని పూనమ్ ట్వీట్ చేసింది. అయినా అతను తనకునచ్చినవారికే అవకాశాలిస్తూ..నన్ను పక్కకి తప్పించడం తప్ప మరేమీ చేయలేడంటూ పూనమ్ ట్విట్టర్ లో రాసుకొచ్చింది. పూనమ్ చేసిన ట్వీట్లలో గురూజీ అని హ్యాష్ టాగ్ వాడటంతో నెటిజన్లు ఆ టాలీవుడ్ దర్శకుడితో పాటు..ఆ దర్శకుడు ఎక్కువగా సినిమాలు తీసిన ఓ పెద్దహీరోను కూడా ట్రోల్ చేస్తున్నారు.