బరితెగించిన ఎస్‌ఐ.. కోరిక తీరిస్తే.. నో కేసు అంటూ..
By తోట వంశీ కుమార్ Published on 24 Aug 2020 2:50 PM ISTమహిళలకు రక్షణ కల్పించాల్సిన ఓ పోలీసే ఓ మహిళపై కన్నేశాడు. మద్యం కేసులో పట్టుపడ్డ ఓ వ్యక్తి కుటుంబ సభ్యులతో పొందూరు ఎస్ఐ రామకృష్ణ మాట్లాడిన ఆడియో టేప్ హల్‌చల్ చేస్తోంది. తన కోరిక తీర్చితే.. కేసు నుంచి తప్పిస్తానని, లేదంటే ఎఫ్ఐఆర్ బుక్ చేసి జైలుకి పంపిస్తాననంటూ బెదరింపులకు పాల్పడ్డాడు. ఫోన్ సంబాషణలు బయటపడటంతో ఆ కీచక ఎస్ఐ గుట్టు రట్టైంది.
వివరాల్లోకి వెళితే.. శ్రీకాకుళం జిల్లా తుంగపేట గ్రామానికి చెందిన అప్పారావు ఇంట్లో 48 మద్యం బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు పెట్టొద్దని వారు కేసు పెట్టొద్దని వారు కాళ్లా వేళ్లా పడగా.. ఎస్‌ఐ రామకృష్ణ నిందితుడు కుమార్తెపై కన్నేశాడు. ఆమె తండ్రిపై కేసు నమోదు చేయకుండా ఉండాలంటే తాను చెప్పినట్లు చేయాలన్నాడు. తన ఇంటి అడ్రస్ చెప్పి అక్కడికి రావాలంటూ ఎస్ఐ అడ్రస్ ఇచ్చాడు. అయితే తన తండ్రితో కలిసి స్టేషన్‌కు వస్తానని బాధితురాలు ఎస్ఐకు చెప్పింది. ఇంటికి ఒంటరిగా వస్తేనే కేసు లేకుండా చేస్తానని చెప్పాడు. ప్రస్తుతం ఆ ఇందుకు సంబంధించిన ఫోన్‌సంబాషణ బయటకు రావడంతో వైరల్‌గా మారింది. కోరిక తీరిస్తే నో కేసు.. లేకపోతే.. కేసు తప్పదంటూ ఆ ఎస్సై బరితెగించడం ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో.. కేసు పూర్తి వివరాల గురించి ఆరా తీస్తున్నారు.