పవన్ కళ్యాణ్ కు పీసీసీ చీఫ్ పదవి ఇప్పిస్తానని అంటున్న హనుమంత రావు

VH Offers PCC Chief Post to Pawan Kalyan. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత హనుమంత రావు ఎప్పుడు ఎటువంటి వ్యాఖ్యలు

By Medi Samrat  Published on  26 Dec 2020 12:36 PM GMT
పవన్ కళ్యాణ్ కు పీసీసీ చీఫ్ పదవి ఇప్పిస్తానని అంటున్న హనుమంత రావు

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత హనుమంత రావు ఎప్పుడు ఎటువంటి వ్యాఖ్యలు చేస్తారో ఆయనకే తెలియదు. తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఊహించని విధంగా వీహెచ్ బంపరాఫర్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ కాంగ్రెస్ పార్టీలో చేరితే ఆయనకు ఏపీలో పీసీసీ చీఫ్ పదవి ఇప్పిస్తానని ప్రకటించారు. వంగవీటి రంగా తర్వాత పవన్ కల్యాణ్‌కు మంచి వేవ్, ఫాలోయింగ్ ఉందని.. ఏపీలో 27 శాతం ఉన్న కాపులు రాజ్యాధికారం సాధించాలని ఆకాంక్షించారు. ఆంధ్రలో 27 శాతం జనాభా ఉన్న కాపులు రాజ్యాధికారం సాధించాలని ఆకాంక్షించారు. కాపు నేతల్లో వంగవీటి రంగా తర్వాత.. అంతటి వేవ్ కాపు నేతల్లో పవన్ కల్యాణ్ కు మాత్రమే ఉందని చెప్పారు.

సూర్యాపేట జిల్లా దొండపాడులో వీహెచ్ వంగవీటి రంగా విగ్రహాన్ని ఆవిష్కరణ సందర్భంగా హనుమంత రావు ఈ వ్యాఖ్యలు చేశారు. వంగవీటి రంగా ఎక్కడ సీఎం అవుతాడేమోనన్న భయంతోనే ఆనాడు ఆయన్ను హత్య చేశారని అన్నారు. బీసీలకు పీసీసీ చీఫ్‌ పదవి ఇవ్వాలని డిమాండ్ చేసినందుకు తనకు ఫోన్లు చేసి బెదిరిస్తున్నారని వీహెచ్ అన్నారు. తనకు ప్రాణం కంటే పార్టీనే ముఖ్యమని చెప్పారు. రేవంత్ రెడ్డికి పీసీసీ ఇస్తే కాంగ్రెస్ పార్టీని బొంద పెడతాడని అన్నారు. టీపీసీసీ చీఫ్ పదవి కోసం కొందరు నేతలు ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారని వీహెచ్ అన్నారు.

రేవంత్ రెడ్డికి పీసీసీ అధ్యక్ష పదవిని అప్పగిస్తే తాను కాంగ్రెస్ పార్టీ నుంచి తప్పుకుంటానని అన్నారు. తనతో పాటు పలువురు ఇతర కాంగ్రెస్ నేతలు కూడా పార్టీని వీడుతారని చెప్పారు. పార్టీకి ఎంతో సేవ చేసిన కోమటిరెడ్డి, జగ్గారెడ్డిలు పీసీసీ చీఫ్ పదవికి పనికిరారా? అని ప్రశ్నించారు.


Next Story