ఇకపై కాంగ్రెస్‌లో అంతర్గత కలహాలకు తావు లేదన్న ఆ ఇద్దరు నేతలు
TPCC Revanth Reddy Meet Jaggareddy. అందరిని కలుపుకొని వెళ్లే సంప్రదాయంతో టీపీసీసీగా ఎన్నికైన రేవంత్ రెడ్డి వెళ్తున్నారని ఎమ్మెల్యే జగ్గారెడ్
By Medi Samrat Published on 6 July 2021 6:41 PM ISTఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. జగ్గారెడ్డి నాకు అత్యంత ఆప్తుడు, మిత్రుడని తెలిపారు. జగ్గారెడ్డిని కలిసే సందర్భంగా వరుణుడు కరుణించాడని అన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల అభిమాన నాయకులు జగ్గారెడ్డి అని రేవంత్ అన్నారు. రేపు టీపీసీసీ నూతన కమిటీ ఛార్జ్ తీసుకోబోతుందని అన్నారు. ఏడేళ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణ ప్రజలకు స్వేచ్చలేదని.. ఉద్యమకారుల పై ఇంకా కేసులు ఎత్తెయ్యలేదని రేవంత్ అన్నారు. కేసీఆర్ కుటుంబం తెలంగాణ ప్రజలను పట్టి పిడిస్తున్నదని.. రేపటి నుంచి కుటుంబాలను వదిలేసి రెండేళ్లు ప్రజల కోసం పనిచేసే విదంగా కాంగ్రెస్ పార్టీ కార్యాచరణ ఉంటుందని రేవంత్ అన్నారు. నిరుద్యోగ సమస్య పై ఎల్లుండి అందరం కలిసి నిర్ణయం తీసుకుంటామని.. రాఫెల్ కుంభకోణంపై పార్లమెంట్ లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ప్రశ్నించనుందని అన్నారు. కాంగ్రెస్ లో అంతర్గత కలహాలకు ఇక నుంచి తావు లేదని అన్నారు.