రాష్ట్ర ప్రజల ఆస్తులు, భవిష్యత్‌ భద్రంగా ఉన్నాయి: సీఎం రేవంత్

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను ఉద్దేశించి తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఎక్స్‌లో పోస్టు పెట్టారు.

By Srikanth Gundamalla  Published on  22 Jun 2024 10:15 AM IST
telangana, cm revanth reddy, tweet, brs, ktr ,

రాష్ట్ర ప్రజల ఆస్తులు, భవిష్యత్‌ భద్రంగా ఉన్నాయి: సీఎం రేవంత్

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను ఉద్దేశించి తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఎక్స్‌లో పోస్టు పెట్టారు. గతంలో కేంద్రం నిర్వహించిన వేలం పాటలో బొగ్గు గనులను అరబిందో, అవంతిక కంపెనీలకు అమ్మేసినప్పుడు ఎందుకు కేటీఆర్ మాట్లాడలేదని ఎక్స్‌లో సీఎం రేవంత్‌రెడ్డి కేటీఆర్‌ను ప్రశ్నించారు. మొదటి, రెండో విడత బొగ్గు గనుల వేలంలో ఈ రెండు కంపెనీలకు తెలంగాణలోని రెండు గనులను కేంద్రం కేటాయించిందనే విషయాన్ని గుర్తు చేశారు. అప్పుడు బీఆర్ఎస్ అధికారంలో ఉందనీ.. కేటీఆర్‌ ఎందుకు సైలెంట్‌గా ఉండిపోయారో చెప్పాలని సీఎం రేవంత్‌రెడ్డి ఎక్స్‌ వేదికగా నిలదీశారు. అప్పుడే వ్యక్తిగత ఒత్తిళ్లు ఉన్నాయా అని ప్రశ్నించారు.

కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో ప్రజలు హ్యాపీగా ఉన్నారని చెప్పారు. రాష్ట్ర ప్రజల ఆస్తులు, హక్కులు, భవిష్యత్ కాంగ్రెస్‌ చేతిలో భద్రంగా ఉన్నాయని చెప్పారు. కేవలం బొగ్గు గనుల కోసమే కాకుండా ప్రజల ప్రతి హక్కు కోసం తాము పోరాడుతామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం.. గత కేసీఆర్ సర్కార్‌ ప్రభుత్వాలు ప్రజల వాటాలను అమ్మేయడం, ప్రయివేటు పరం చేశారని చెప్పారు. అప్పుడు కాంగ్రెస్ నేతలంతా గట్టిగా వ్యతిరేకించాయన్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మరిన్ని గనులను వేలం వేయడాన్ని వ్యతిరేకిస్తూ నిరసన తెలపడానికే కాకుండా గతంలో అరబిందో, అవంతిక కంపెనీలకు అమ్మేసిన గనులను సైతం వెనక్కి ఇవ్వాలని కోరడానికే గనుల వేలం ప్రారంభోత్సవ కార్యక్రమానికి వెళ్లారని సీఎం రేవంత్‌ రెడ్డి వివరించారు.

Next Story