పబ్లిసిటీ కోసం బీజేపీ రూ. 313.17 కోట్లు, బీఆర్‌ఎస్ రూ. 7.7 కోట్లు, వైఎస్సార్సీపీ సున్నా
Publicity blitzkrieg BJP spent Rs 313.17 Cr, BRS Rs 7.7 Cr, YSRCP zero.గత ఆర్థిక సంవత్సరంలో కేవలం ప్రకటనలు, ప్రచారం
By న్యూస్‌మీటర్ తెలుగు
గత ఆర్థిక సంవత్సరంలో కేవలం ప్రకటనలు, ప్రచారం కోసమే భారతీయ జనతా పార్టీ (బీజేపీ) రూ.313,17,09,369 కోట్లు ఖర్చు చేసింది. జనవరి 17, 2023న భారత ఎన్నికల సంఘానికి సమర్పించిన వార్షిక ఆడిట్ నివేదికను పార్టీ వెల్లడించింది.2021తో పోలిస్తే 2022లో పబ్లిసిటీ కోసం బీజేపీ రూ.151 కోట్లు అధికంగా ఖర్చు చేసింది.
న్యూఢిల్లీకి చెందిన V. K థాపర్ & కో గత ఆర్థిక సంవత్సరంలో బీజేపీ యొక్క ఆర్థిక నివేదికను ఆడిట్ చేసింది. గత 8 ఏళ్లలో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రకటనల కోసం కేంద్రంలోని అధికార పార్టీ రూ. 6491 కోట్లు ఖర్చు చేసిందని సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ ఇటీవల లోక్‌సభలో చెప్పారు.
ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రకటనల కోసం ప్రభుత్వం ₹3,260.79 కోట్లు ఖర్చు చేయగా, 2014లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి డిసెంబర్ 2022 వరకు ప్రింట్ మీడియాలో రూ.3,230.77 కోట్లు ఖర్చు చేసింది.
వ్యయ విభజన:
2021-22లో బీజేపీ కేవలం ప్రకటనలకే రూ.164,01,74,805 ఖర్చు చేసింది. మిగిలినవి ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియాలో హోర్డింగ్‌లు మరియు ప్రమోషన్‌తో సహా క్రియేటివ్‌ల కోసం ఖర్చు చేయబడ్డాయి.
ప్రకటనలు : రూ. 164,01,74,805 కోట్లు
క్రియేటివ్స్
ఆడియో కంటెంట్: రూ. 68.17 లక్షలు
వీడియో కంటెంట్: రూ. 17.72 కోట్లు
హోర్డింగ్ బ్యానర్లు, కటౌట్లు: రూ. 36.33 కోట్లు
ఎలక్ట్రానిక్ మీడియా: రూ 72.28 కోట్లు
ప్రింట్ మీడియా: రూ 22.12 కోట్లు
విమాన ప్రయాణాలకు బీజేపీ అధికంగానే ఖర్చు చేసింది. విమానాలు, హెలికాప్టర్లలలో ప్రయాణాల కోసం రూ. 117.41 కోట్లు ఖర్చు చేసింది. బోర్డింగ్, లాడ్జింగ్ కోసం రూ. 5.30 కోట్లు ఖర్చు చేశారు. ఇతర ప్రయాణ ఖర్చులు రూ.10.51 కోట్లు. ఒక్క ప్రయాణానికే ఖర్చు చేసిన మొత్తం రూ.133.228 కోట్లు.
బీఆర్ఎస్ వ్యయం:
భారతీయ రాష్ట్ర సమితిగా పేరు మార్చబడిన తెలంగాణ రాష్ట్ర సమితి 2022లో ప్రకటనల కోసం రూ. 7.21 కోట్లు, ఎన్నికల ఖర్చు కోసం మరో రూ. 56 లక్షలు ఖర్చు చేసినట్లు ECIకి తెలియజేసింది. 2021లో నాగార్జున సాగర్‌తో సహా కొన్ని ముఖ్యమైన నియోజకవర్గాలకు ఉప ఎన్నికలను జరిగాయి.
వైఎస్ఆర్‌సీపీ :