మాజీమంత్రి ఈటల రాజేందర్ బీజేపీలో చేరిన సంగ‌తి తెలిసిందే. అయితే ఈ విష‌య‌మై హుజురాబాద్‌ బీజేపీ నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. గతంలో ఈటల బీజేపీలో చేరడాన్ని తీవ్రంగా వ్య‌తిరేకించిన పెద్దిరెడ్డి.. బీజేపీలోకి ఈటల రాజేందరే కాదు సీఎం కేసీఆర్ వచ్చినా స్వాగతిస్తామని ప్రకటించారు. అయితే.. ఎన్నికల సమయంలోనే బీజేపీ అభ్యర్థి గురించి ఆలోచిస్తామని, అవకాశం వస్తే హుజూరాబాద్‌లో పోటీ చేస్తానని వెల్లడించారు. కేసీఆర్‌ను తాను కలవలేదని, ఆయన ఫామ్‌హౌస్ ఎక్కడ ఉందో తెలియదన్నారు. బీజేపీలో చాలా మంది అభ్యర్థులు ఉన్నారని.. వారందరూ పోటీకి అర్హులేనని పెద్దిరెడ్డి వ్యాఖ్యానించారు.

ఇదిలావుంటే.. ఈటల చేరిక‌ను వ్య‌తిరేకించిన పెద్దిరెడ్డి.. ఆయ‌న‌ బీజేపీలోకి వస్తే మరో ఉప్పెన తప్పదని తనను సంప్రదించకుండా ఈటలను పార్టీలోకి ఎలా ఆహ్వానిస్తారని అధిస్టానాన్ని ప్రశ్నించారు. అయితే ప్ర‌స్తుతం పెద్దిరెడ్డి మాట మార్చారు. ఈటల బీజేపీలో చేరితే.. తాను హుజూరాబాద్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని ప్రకటించిన‌ పెద్దిరెడ్డి తాజాగా.. బీజేపీలోకి ఎవరు వచ్చినా ఆహ్వానిస్తామని ఇప్పుడు ప్రకటించడం గమనార్హం.


సామ్రాట్

Next Story