'నీ నోటికి, మున్సిపాలిటీ కుప్పతొట్టికి పెద్ద తేడా లేదు'.. రోజా పై నాగబాబు ఘాటు వ్యాఖ్యలు
Janasena Leader Nagababu strong Counter to Minister Roja.మంత్రి రోజాపై జనసేన నేత నాగబాబు తీవ్ర స్థాయిలో
By తోట వంశీ కుమార్ Published on 7 Jan 2023 10:16 AM ISTఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి రోజాపై జనసేన నేత నాగబాబు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇటీవల మంత్రి రోజా మెగా ఫ్యామిలీపై చేసిన కామెంట్లకు నాగబాబు కాస్త గట్టిగా కౌంటర్ ఇచ్చారు. రోజా నోటిని మున్సిపాలిటీ కుప్పతొట్టితో పోల్చారు. ఇచ్చిన బాధ్యతలను రోజా మరిచిపోయి ఇలా మాట్లాడుతుందన్నారు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని పర్యాటక శాఖను ఎలా అభివృద్ధి చేయాలనే విషయాలపై దృష్టి సారించాలని అన్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో నాగబాబు ఓ వీడియోను విడుదల చేశారు.
"రోజా... భారతదేశ పర్యాటక శాఖ ర్యాంక్సింగ్‌లో ఉన్న 20 స్థానాల్లో కేరళ, అసోం, గుజరాత్ వంటి రాష్ట్రాలు తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తీసుకుంటే 18వ స్థానంలో ఉంది. ఇంకా కిందకెళ్తే చత్తీస్ గఢ్, ఝార్ఖండ్ ఉన్నాయి. నువ్వు ఇలాగే నీ బాధ్యతలను మర్చిపోయి నోటికొచ్చినట్టు పిచ్చిపిచ్చిగా మాట్లాడితే.. అతి త్వరలో అంటే నువ్వు పదవి దిగిపోయేలోగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 20వ స్థానానికి తీసుకుపోయే అవకాశం ఉంది. ఏపీ పర్యాటక శాఖ మీద ఆధారపడి కొన్ని వేల మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా జీవిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వారి జీవితాలు మట్టికొట్టుకుపోయాయి. నీవు ఇలాగే పిచ్చిపిచ్చిగా మాట్లాడితే వాళ్ల పరిస్థితి మరింత దిగజారిపోతుంది. ముందు పర్యాటక శాఖ మంత్రిగా నీ బాధ్యతలు ఏమిటో తెలుసుకో. పర్యాటక శాఖ మంత్రి అంటే నీవు పర్యటనలు చేయడం కాదు. పర్యాటక శాఖను ఎలా అభివృద్ధి చేయాలో తెలుసుకో. నీవు ఇన్ని రోజులు చిరంజీవిని, పవన్ కల్యాణ్ ని నోటి కొచ్చినట్టు మాట్లాడినా ఆఫ్ కోర్స్ నా గురించి కూడా మాట్లాడినా నేను లెక్క చేయను. మా పార్టీ అధినేత పవన్ ని, అన్నయ్య చిరంజీవిని నోటికొచ్చినట్టు మాట్లాడినా నేను ఎందుకు రియాక్ట్ కాలేదంటే దానికి ఒకే ఒక కారణం ఉంది. నీ నోటికి, మున్సిపాలిటీ కుప్పతొట్టికి పెద్ద తేడా లేదు. చూస్తూచూస్తూ ఎవడూ మున్సిపాలిటీ కుప్పతొట్టిని గెలకడు. అదీ రీజన్. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని, పర్యాటక శాఖను ఎలా అభివృద్ధి చేయాలో తెలుసుకో" అంటూ రోజాపై నాగబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు.
రోజా @RojaSelvamaniRK
— Naga Babu Konidela (@NagaBabuOffl) January 6, 2023
నీది నోరా లేక మున్సిపాలిటీ కుప్పతొట్టా ? pic.twitter.com/SFeIpZdBeL