పవన్ కళ్యాణ్ కు కలిసొచ్చిన అంశాలు ఏమిటి.?
నటుడు పవన్ కళ్యాణ్ పిఠాపురం అసెంబ్లీ నియోజక వర్గంలో గెలుపొంది తన మొదటి ఎన్నికల విజయాన్ని నమోదు చేశారు
By న్యూస్‌మీటర్ తెలుగు
నటుడు పవన్ కళ్యాణ్ పిఠాపురం అసెంబ్లీ నియోజక వర్గంలో గెలుపొంది తన మొదటి ఎన్నికల విజయాన్ని నమోదు చేశారు. ఆయన తన సమీప ప్రత్యర్థి, వైఎస్సార్‌సీపీ నేత వంగగీతపై 70,354 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. కాపు ఓట్లు ఎక్కువగా పవన్ కళ్యాణ్ కు పడడం విజయం సాధ్యమైంది.
దశాబ్దం క్రితం ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన పవన్ కళ్యాణ్ రెండోసారి అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. అందుకే పీకేకి 2024 ఎన్నికలు చాలా ముఖ్యం. 2019 ఎన్నికల్లో భీమవరం, గాజువాక అసెంబ్లీ స్థానాల్లో పవన్ కళ్యాణ్ ఓటమి చవిచూశారు. ఈసారి ఎమ్మెల్యేగా గెలవడానికి పవన్ కళ్యాణ్ తీవ్రంగా శ్రమించారు.
కాపు ఓట్ల సమీకరణ పీకేకి పనికొచ్చిందా?
పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో 2.35 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. కాపు సామాజికవర్గం ఓటర్లు పెద్ద సంఖ్యలో పవన్ వైపు చూసారు. ఆయన ప్రత్యర్థిగా అదే సామాజిక వర్గానికి సంబందించిన వంగ గీత.. కాపుల ఓట్లను పొందడంలో విఫలమయ్యారు. పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్నప్పటి నుండి.. పవన్ కళ్యాణ్ పై అంచనాలు చాలా ఎక్కువగా ఉన్నాయి పిఠాపురం ఎమ్మెల్యే సీటుపై దృష్టి సారించిన టీడీపీ.. ఆఖర్లో పవన్ కళ్యాణ్ ను నిలబెట్టాలని భావించింది. పిఠాపురంలో 80,000-90,000 కాపు ఓట్లు సాధించాలనే లక్ష్యంతో పవన్ కళ్యాణ్ కు టీడీపీ మద్దతు ఇచ్చింది. 21 నియోజకవర్గాల్లో జనసేనకు అనుకూలంగా 75% కాపు ఓట్ల సమీకరణ జరిగింది.
కూటమి ముఖ్యం:
పవన్ కళ్యాణ్ లేకుంటే టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తుకు ఎప్పటికీ జరిగి ఉండేది కాదు. మొదటి నుంచి బీజేపీతో దోస్తీ చేస్తూ వచ్చిన పవన్ కళ్యాణ్.. టీడీపీని కూడా కూటమిలోకి తీసుకురావడంలో పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషించారు.
కుటుంబం నుండి మంచి మద్దతు:
పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులు వరుణ్ తేజ్, సాయి ధర్మ తేజ్, వైష్ణవ్ తేజ్ నియోజకవర్గంలో పర్యటించి తమ మామను ఆదరించాలని ఓటర్లను కోరారు. తమ కుటుంబ సభ్యుడి కోసం స్టార్లు ప్రచారం చేయడం పిఠాపురంలో జనసేనకు కలిసొచ్చే అంశం.
ఆయన ఏదైనా మంత్రివర్గం తీసుకుంటారా?
ఆయన సోదరుడు నాగ బాబు ప్రకారం.. PK ఏ పదవి లేదా మంత్రివర్గం తీసుకోకపోవచ్చు. ప్రభుత్వానికి చేతనైన మద్దతుగా ఉంటాడు. ఆయన ఏపీలో బాల్ కేశవ్ ఠాక్రే అవుతారన్నారు. "ముఖ్యమంత్రి స్థాయి ఉన్న ఆయన, మంత్రి పదవితో సరిపెట్టుకోలేరు. ఏపీకి తదుపరి సీఎం కావాలనేది ఆయన మనసులో ఉంది. జనసేన ఎమ్మెల్యేలకు కీలక పదవులు అడగడంతో పాటు, పీకే క్షేత్రస్థాయిలో కూటమిలో భాగంగా ఉండనున్నారు." అని నాగ బాబు అన్నారు. 2029లో పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అభ్యర్థి అని జనసేన పార్టీ విశ్వసిస్తోంది.
మాస్ లీడర్:
జనసేన రాజకీయ సలహాదారు అజయ్‌కుమార్ వేములపాటి న్యూస్‌మీటర్‌తో మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ స్టార్ ఆఫ్ మాస్ అని అన్నారు. రాష్ట్ర నిర్మాణంలో జనసేన ప్రధాన పాత్ర పోషిస్తుందని, ప్రగతి పథంలో దూసుకుపోతుందన్నారు. "పవన్ కళ్యాణ్ ప్రభుత్వానికి అండగా ఉండడమే కాకుండా.. అభివృద్ధి పనులపై కూడా దృష్టిపెడతారు. జనసేన ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమం విషయంలో ట్రాక్‌లో ఉండేలా చేస్తుంది" అని అజయ్ అన్నారు.
చంద్రబాబు నాయుడు క్యాబినెట్‌లో జనసేన అభ్యర్థుల పాత్ర గురించి అడగ్గా.. దానిపై వ్యాఖ్యానించడం చాలా తొందరపాటు చర్య అవుతుందని అన్నారు. అయితే జనసేన ప్రభుత్వంలో కచ్చితంగా భాగం అవుతుందని అన్నారు.