కాంగ్రెస్ నేతలే బీజేపీకి ఓటెయ్యాలని చెప్పారు: వినోద్ కుమార్

తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్‌ సీనియర్ నేత వినోద్ కుమార్‌ సీరియస్ అయ్యారు.

By Srikanth Gundamalla  Published on  18 May 2024 2:12 PM IST
brs, vinod kumar,  congress, bjp, pm modi,

 కాంగ్రెస్ నేతలే బీజేపీకి ఓటెయ్యాలని చెప్పారు: వినోద్ కుమార్

తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్‌ సీనియర్ నేత వినోద్ కుమార్‌ సీరియస్ అయ్యారు. రాష్ట్రంలో సీఎం రేవంత్‌రెడ్డి గొప్పగా చెప్పుకునే పథకం ఒక్కటీ లేదన్నారు. ఇక నుంచి అయినా సరైన నిర్ణయాలు తీసుకోవాలని.. ప్రజలకు మంచి జరిగే కార్యక్రమాలను అమలు చేయాలని చె్పారు. తెలంగాణ భవన్‌లో వినోద్‌ కుమార్‌ మీడియా సమావేశం చేసిన సందర్భంగా ఈ కామెంట్స్ చేశారు.

మరోవైపు లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ఏవేవో మాట్లాడుతున్నారని వినోద్ కుమార్ అన్నారు. ఈ సారి లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి 272 సీట్లు రాకపోతే బీజేపీ నాయకులే మోదీని ప్రధానమంత్రి పదవి చేపట్టకుండా చేస్తారంటూ ఆరోపణలు చేశారు. ఉత్తర్‌ ప్రదేశ్‌లో బహిరంగ సభలో పాల్గొన్న ప్రధాని మోదీ.. ఫ్రస్టేషన్‌లో మాట్లాడారని చెప్పారు. రామమందిరాన్ని కూల్చేస్తారంటూ ఆరోపణలు చేశారనీ.. కానీ అలా చేసే దమ్ము ఎవరికీ లేదన్నారు. కరీంనగర్‌ లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులే బీజేపీకి ఓటు వెయ్యమని చెప్పారని అన్నారు. తన దగ్గర దీనిపై ఆధారాలు కూడా ఉన్నాయని వినోద్ కుమార్‌ చెప్పారు.

కాంగ్రెస్‌ పాలనలో తెలంగాణ రైతులు ఇబ్బందులు పడుతున్నారని వినోద్ కుమార్ చెప్పారు. సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన జరుగుతున్న కేబినెట్ సమావేశంలో రైతుల కోసం సానుకూల నిర్ణయాలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు రైతుభరోసా అమలు కాలేదనీ. రైతుభరోసాను అమలు చేసి ఎకరాకు రూ.15వేలు అందించాలని అన్నారు. వరి పండించిన రైతులకు రూ.500 బోనస్‌ ఇవ్వాలని డిమాండ్ చెప్పారు. బోనస్‌ను బోగస్‌గా మార్చొద్దన్నారు. అకాల వర్షంతో ధాన్యం తడిసిన నష్టపోతున్న రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలని చెప్పారు. కనీస మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేయాలని బీఆర్‌ఎస్ సీనియర్ నేత వినోద్ కుమార్ డిమాండ్ చేశారు.

Next Story