పొన్నం ప్రభాకర్‌కు బండి సంజయ్ క్షమాపణ చెప్పాలి: కేటీఆర్
కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
By Srikanth Gundamalla Published on 7 March 2024 7:00 PM ISTపొన్నం ప్రభాకర్‌కు బండి సంజయ్ క్షమాపణ చెప్పాలి: కేటీఆర్
కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బండి సంజయ్ ఎప్పుడేం మాట్లాడతారో ఆయనకే తెలియదన్నారు. చొక్కారావు, బద్దం ఎల్లారెడ్డి, కేసీఆర్ వంటి మహానుభావులు ప్రాతినిథ్యం వహించిన కరీంనగర్‌లో.. బండి సంజయ్ అడ్డిమారి గుడ్డిదెబ్బతో గెలిచారంటూ ఎద్దేవా చేశారు. గురువారం కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా మాట్లాడిన కేటీఆర్.. బండి సంజయ్‌పై మండిపడ్డారు. ఐదేళ్లలో కరీంనగర్ నియోజకవర్గానికి ఏం చేశారో చెప్పాలంటూ నిలదీశారు.
కాగా.. తెలంగాణ ఏర్పాటు తర్వాత కరీంనగర్ ఎంపీగా ఐదేళ్లు వినోద్ కుమార్ ఉన్నారనీ.. ఆ తర్వాత ఐదేళ్లు బండి సంజయ్ ఉన్నారని కేటీఆర్ అన్నారు. ఎంపీగా వినోద్ కుమార్ ఏం చేశారో చెప్పడానికి ఆయన సిద్ధమనీ.. బండి సంజయ్ ఏం చేశారో చెప్పడానికి రెడీయా అని ప్రశ్నించారు. టైమ్ బండి సంజయ్ చెప్పినా సరే చర్చకు వినోద్ కుమార్ రెడీగా ఉన్నారంటూ సవాల్ విసిరారు. కరీంనగర్ కమాన్‌లోనే బండి సంజయ్ ఏంటో తెలుస్తామని వ్యాఖ్యానించారు. ఎంపీగా ప్రధాని మోదీని పట్టుకుని ఒక్క పని చేశానని చెప్పే ముఖం బండి సంజయ్‌కి లేదన్నారు. అలాంటి వ్యక్తికి కరీంనగర్ ప్రజలను ఓట్లు వేయాలని అడిగే హక్కే లేదంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు.
మంత్రి పొన్నం ప్రభాకర్‌పై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపైనా కేటీఆర్ స్పందించారు. కేసీఆర్ ఒక్క మాట అంటేనే నానా రచ్చ చేసి ఊరూరా ఫ్లెక్సీలు పెట్టి చిల్ల ప్రచారం చేశాడని అన్నారు. గోల్‌మాల్ చేసి గెలిచిన ఎంపీవంటూ విమర్శించారు. పొన్నం ప్రభాకర్‌పై చేసిన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేశారు. నీ తల్లికి నువ్వు పుట్టినవా అంటూ చిల్లరగా మాట్లాడేవారు ఎంపీగా అస్సలు పనికిరారని చెప్పారు. బండి సంజయ్‌కు ప్రజలకు మంచి చేయడం చేతకాదు కానీ.. నోరు వేసుకుని పిచ్చిగా మాట్లాడమంటే మాత్రం ముందుంటారంటూ ఫైర్ అయ్యారు. ఆఖరికి బండి సంజయ్‌కి ఇచ్చిన ఎంపీ నిధులు కూడా ఖర్చు పెట్టే చేతకాదంటూ ఎద్దేవా చేశారు. బండి సంజయ్ ఎంపీగా ఉండటం దండగ అన్నారు కేటీఆర్.