బీజేపీకి సీఎం రేవంత్‌ ఎందుకు భయపడుతున్నారు? కేటీఆర్

తాజాగా బీఆర్ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సీఎం రేవంత్‌పై విమర్శలు చేశారు.

By Srikanth Gundamalla  Published on  3 Feb 2024 6:51 AM GMT
brs, ktr, cm revanth reddy, telangana,

బీజేపీకి సీఎం రేవంత్‌ ఎందుకు భయపడుతున్నారు? కేటీఆర్

తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్‌, ప్రభుత్వ ప్రజా ప్రతినిధుల మధ్య విమర్శల దాడులు కొనసాగుతున్నాయి. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పలు పాలు చేసిందనీ.. ఎవరికీ మంచి చేయలేదంటూ కాంగ్రెస్ ప్రభుత్వం మండిపడుతోంది. మరోవైపు బీఆర్ఎస్‌ నాయకులు కూడా కాంగ్రెస్ నేతలకు కౌంటర్ వేస్తున్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదనీ.. అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చారంటూ ఫైర్ అవుతున్నారు. తాజాగా బీఆర్ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సీఎం రేవంత్‌పై విమర్శలు చేశారు.

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌లో తెలంగాణకు ఏమీ కేటాయింపులు ఇవ్వలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. బడ్జెట్‌లో తెలంగాణకు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అన్యాయం చేసినా సీఎం రేవంత్‌రెడ్డి ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. బీజేపీకి వ్యతిరేకంగా సీఎం రేవంత్‌ ఒక్క మాట కూడా మాట్లాడటం లేదని అన్నారు. తెలంగాణ సీఎం బీజేపీకి ఎందుకు భయపడుతున్నారంటూ ప్రశ్నించారు. రాష్ట్ర ప్రయోజనాలకు అనుగుణంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేయడం లేదన్నారు. కృష్ణా బోర్డుకు ప్రాజెక్టులను అప్పగించి.. రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్ కామెంట్స్ చేశారు.


Next Story