కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించింది నేనే: బండి సంజయ్

తెలంగాణలో ఎన్నికల వేళ రాజకీయ పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది.

By Srikanth Gundamalla  Published on  10 May 2024 1:09 PM IST
bandi sanjay, kcr, brs, telangana, politics,

 కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించింది నేనే: బండి సంజయ్

తెలంగాణలో ఎన్నికల వేళ రాజకీయ పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. తాజాగా కరీంనగర్ బీజేపీ అభ్యర్థి బండి సంజయ్‌.. బీఆర్ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ గడీలు బద్దలు కొట్టి.. బీఆర్ఎస్ సర్కార్‌ను గద్దె దించింది తానేని చెప్పారు. హిందూ ధర్మంపై కసితో.. హిందువులంటే కోపంతో కేసీఆర్ ఉన్నాడని ఆఓపించారు. అంతేకాదు.. హిందూ దేవుళ్లంటే భయంతో ఉన్నాడంటూ కేసీఆర్‌పై విమర్శలు చేశారు. కేసీఆర్ మతం గురించి మట్లాడొచ్చు కానీ.. తాను మాట్లాడొద్దా అని ప్రశ్నించారు. కేసీఆర్‌ కరీంనగర్‌ సభ ద్వారా 80 శాతం ఉన్న హిందువుల గురించి మాట్లాడకుండా.. 20 శాతం ఉన్న ముస్లింలను ఒక్కటి కావాలని పిలుపునిచ్చారని బండి సంజయ్ అన్నారు. హిందువులను అవమానపరుస్తోన్న కేసీఆర్‌కు ఇప్పటికే ప్రజలు అసెంబ్లీ ఎన్నికల్లో బుద్ధి చెప్పారని అన్నారు. అయితే.. మరోసారి ఇప్పుడు లోక్‌సభ ఎన్నికల్లో గట్టిగా సమాధానం ఇవ్వాలని బండి సంజయ్ పిలుపునిచ్చారు.

కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు పోలీస్ వలయాన్ని పెట్టి తనని భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారని బండి సంజయ్ చెప్పారు. కానీ.. తాను ఏమాత్రం వెనక్కి తగ్గకుండా కేసీఆర్ పెట్టిన పోలీస్‌ వలయాన్ని చేదించుకుని అమ్మవారిని దర్శించుకున్నట్లు చెప్పారు. తాను సూటిగా చెప్తున్నాననీ.. కచ్చితంగా హిందువుల కోసం పనిచేస్తానని అన్నారు. అలాగే కరీంనగర్ అభివృద్ధి కోసం కూడా పనిచేస్తాననీ.. మోదీ బాటలోనే నడుస్తానని బండి సంజయ్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కేసీఆర్‌కు బండి సంజయ్ సవాల్‌ విసిరారు. కరీంనగర్‌లో బీఆర్ఎస్‌ అభ్యర్థి ఓడిపోతే ఆ మతం పుచ్చుకుని రాజకీయాల నుంచి తప్పుకుంటావా అని చాలెంజ్ చేశారు. కేసీఆర్‌ హిందూ ధర్మాన్ని హేళన చేయడం మానుకోవాలంటూ బండి సంజయ్‌ ఫైర్ అయ్యారు.

హిందువల కోసం.. హిందూ సమాజం కోసం మాట్లాడేది తాను మాత్రమే అని బండి సంజయ్ చెప్పారు. అలాగే కరీంనగర్ ప్రజల కోసం కొట్లాడే ఏకైక వ్యక్తిని కూడా తానే అన్నారు. కేసీఆర్ మాత్రం కరీనంనగర్‌కు వచ్చి తమాషాలు చేశారంటూ విమర్శించారు. ముస్లింలు కూడా కేసీఆర్‌ పార్టీ అయిన బీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా ఉన్నారని బండి సంజయ్ చెప్పారు.

Next Story